Tamilnadu theatres issue: మాస్టర్ సినిమా నిర్మాతలకు, ఆ సినిమా హీరో విజయ్‌కు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. మాస్టర్ సినిమా ప్రదర్శన విషయంలో తమిళనాడులోని థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ముకునేలా థియేటర్లకు అనుమతి ఇస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తీవ్రంగా తప్పు పట్టింది. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టనందున 100 శాతం ఆక్యుపెన్సీతో ( 100 % Occupancy in theatres ) థియేటర్లకు అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏ మాత్రం చెల్లదు అని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విజయ్ అభిమానులకు సంక్రాంతి కానుకగా మాస్టర్ మూవీ ఈ నెల 13న తమిళ, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ రాష్ట్రంలోనైనా సినిమా థియేటర్లు, మల్టిప్లెక్సుల విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కరోనావైరస్ ప్యాండెమిక్ నిబంధనలు అమలులో ఉన్నందున కేంద్రం విధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు అతిక్రమించడానికి వీల్లేదని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. 


మాస్టర్ చిత్రం హీరో విజయ్ ఇళయదళపతి ( Vijay Ilayathalapathy ) నేరుగా వెళ్లి విజ్ఞప్తి చేయడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఈపీఎస్ పళనిస్వామి కేంద్రం దశలవారీగా తీసుకొస్తున్న అన్‌లాక్ మార్గదర్శకాలను సడలించి మాస్టర్ చిత్రానికి 100 శాతం టికెట్స్ అమ్ముకోవడానికి అనుమతించారు. అయితే, తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనియాంశమైంది. సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యానికి తూట్లు పొడిచేలా తమిళనాడు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కరోనా కేసులు ( COVID-19 cases ) మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. 


Also read : Mahesh Babu's fan: మహేష్ బాబు ఫ్యాన్‌గా నాగ చైతన్య


ఈ నేపథ్యంలోనే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తమిళనాడు సర్కారు నిర్ణయాన్ని తప్పుపడుతూ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. దీంతో కేంద్రం ఆదేశాలు, అభ్యంతరాల కారణంగా మాస్టర్ చిత్రం ( Master movie ) కూడా అన్ని చిత్రాల్లాగే 50 శాతం ఆక్యుపెన్సీతోనే ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Also read : Sonu Sood gifts smartphones: ఆచార్య సెట్లో 100 స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన సోనూసూద్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook