Mahesh Babu's fan: మహేష్ బాబు ఫ్యాన్‌గా నాగ చైతన్య

సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే వీరాభిమానులకు సూపర్ కూల్ న్యూస్ ఇది. మహేష్ బాబుని ఇష్టపడే అభిమానుల జాబితాలో హీరో నాగ చైతన్య కూడా చేరారు. అంతేకాదు.. మహేష్ బాబుని అభిమానించే వీరాభిమాని పాత్రలో నాగ చైతన్య నటిస్తుండటం మరో విశేషం.

Last Updated : Jan 6, 2021, 10:23 PM IST
Mahesh Babu's fan: మహేష్ బాబు ఫ్యాన్‌గా నాగ చైతన్య

సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే వీరాభిమానులకు సూపర్ కూల్ న్యూస్ ఇది. మహేష్ బాబుని ఇష్టపడే అభిమానుల జాబితాలో హీరో నాగ చైతన్య కూడా చేరారు. అంతేకాదు.. మహేష్ బాబుని అభిమానించే వీరాభిమాని పాత్రలో నాగ చైతన్య నటిస్తుండటం మరో విశేషం. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌లో థాంక్యూ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

నాగ చైతన్య మహేష్ బాబు అభిమాని పాత్రలో నటిస్తుండటంతో రామకృష్ణ థియేటర్ వద్ద మహేష్ బాబు ( Mahesh Babu ) ఫ్లెక్సీలు, బ్యానర్స్ ఏర్పాటు చేసి వాటి మధ్యే పలు సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 

Also read : Sonu Sood gifts smartphones: ఆచార్య సెట్లో 100 స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేసిన సోనూసూద్‌

అక్కినేని కుటుంబానికి, ఘట్టమనేని కుటుంబానికి మధ్య అనాది నుంచి మంచి సంబంధాలున్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ మధ్య సాన్నిహిత్యం ఉండేది. ఆ సాన్నిహిత్యం అలాగే కొనసాగుతూ వస్తోంది. తాజాగా నాగ చైతన్య ( Naga Chaitanya ) ఎంచుకున్న ఈ సినిమాతో ఆ బంధం మరో తరానికి బాటలు వేసినట్టయిందని అంటున్నారు అక్కినేని, ఘట్టమనేని అభిమానులు.

Also read : KGF Yash గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News