Tammareddy on Mallemala Remuneration తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఢీ కొరియోగ్రఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్ మీద స్పందించాడు. ఆయనకు ముందు చేసిన అప్పులేమైనా ఉన్నాయో ఏమో మరి.. అయినా అలా సూసైడ్ చేసుకోవడం తప్పు అని అన్నాడు. ఇక ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్‌లు ఇస్తున్నారు.. జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తున్నారని అనడం తప్పు.. ఏ షోను బట్టి ఆ షోకు.. దాని స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుంది.. నాకు తెలిసి ఢీ షోలోనూ బాగానే ఇస్తుంటారు.. రాజమౌళికి వంద కోట్లు ఇస్తున్నారు.. త్రివిక్రమ్‌కి యాభై కోట్లు ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వరు అని నేను సూసైడ్ చేసుకుంటానా? అది చాలా తప్పు అంటూ ఇలా తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్ అని జబర్దస్త్ షోలో ఎక్కువ ఇస్తున్నారంటూ.. ఢీ వల్ల ఫేమ్, నేమ్ వచ్చింది కానీ డబ్బులు రాలేదని సూసైడ్ వీడియోలో చైతన్య మాస్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మల్లెమాల రెమ్యూనరేషన్ల మీద మరోసారి చర్చలు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇలా తమ్మారెడ్డి భరద్వాజ్ జీ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. సూసైడ్ చేసుకోవడం తప్పు అని, అలా రెమ్యూనరేషన్లు పోల్చుకోవడం కూడా తప్పేనంటూ చెప్పుకొచ్చాడు.


 



నిన్న నెల్లూరులోని హోటల్‌లో చైతన్య మాస్టర్ ఉరివేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రోజే చైతన్య మాస్టర్‌కు ఘనంగా సన్మానం కూడా జరిగింది. అయితే అప్పుల బాధలు తాళలేకనే ఇలా సూసైడ్ చేసుకుంటున్నట్టుగా చెప్పిన మాటలు, ఆ చివరి వీడియో ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్


నీ నవ్వులు ఎప్పుడూ అందరి మదిలోనూ గుర్తుండిపోతాయ్ అని శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్ వంటి వారు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మీరు ఇలా చేసి చాలా బాధపెట్టారు మాస్టార్ అంటూ వర్ష,ఆది, ఇతర కంటెస్టెంట్లు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ జెస్సీ సైతం మాస్టర్ మరణం పట్ల విషాదాన్ని వ్యక్తం చేశాడు.


Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook