Tantra - ananya nagalla:`తంత్ర`తో భయపెడుతున్న అనన్య నాగళ్ల.. వెరైటీ వార్నింగ్‌తో అట్రాక్ట్ చేస్తోన్న రిలీజ్ డేట్ పోస్టర్..
Tantra - ananya nagalla: అనన్య నాగళ్ల తెలుగులో ఇపుడిపుడే పేరు తెచ్చుకుంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `వకీల్ సాబ్` మూవీతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో కథానాయికగా నటిస్తూ తన లక్ పరీక్షించుకుంటోంది. ఈ కోవలో ఈమె `తంత్ర` మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Tantra - ananya nagalla: తెలుగులో మల్లేశం, ప్లే బ్యాక్ వంటి సినిమాలతో ఫేమస్ అయింది. తెలుగు అమ్మాయి అనే చిన్నచూపుతో ఈమెకు భారీగా అవకాశాలు అనుకున్నంత రేంజ్‌లో మాత్రం రావడం లేదనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్‌తో చేసిన 'వకీల్ సాబ్' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించక పోయినా.. తన క్యారెక్టర్‌తో ఈమె ఫేమస్ అయింది. ప్రస్తుతం ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె 'తంత్ర' అనే హార్రర్ మూవీతో రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికేట్ జారీ చేసారు. దీంతో నిరాశ చెందకుండా చిత్ర యూనిట్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయింది. మా సినిమాకు 'పిల్లా బచ్చాలు' రావద్దంటూ హెచ్చరిస్తూ 'A'ను హైలెట్ చేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
సెన్సార్ వాళ్లు ఇచ్చిన A సర్టిఫికేట్‌ను ఇలా క్రియేటివ్‌గా ప్రమోషన్ కొరకు వాడుకోవడం మాములు విషయం కాదు. అంతేకాదు తమ సినిమాకు చిన్న పిల్లలు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అనన్య అచ్చమైన పల్లెఊరి అమ్మాయి పాత్రలో నటించింది. ఇందులో క్షుద్ర పూజలకు బలైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్లకు జోడిగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి నటించారు.
మరోవైపు ఇతర ముఖ్యపాత్రల్లో సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ నటించారు. శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఇతను వాల్డ్ డిస్నీలో పనిచేసే రేంజ్‌కు ఎదిగాడు. దర్శకుడు కావాలన్న తన లక్ష్యాన్ని తాజాగా 'తంత్ర' మూవీతో సాధించాడు. ఈ సినిమాను మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అనన్య నాగళ్ల విషయానికొస్తే.. ఈమె వకీల్ సాబ్ మూవీ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. కానీ హీరోయిన్‌గా సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. మరి సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోన్న అనన్య నాగళ్ల 'తంత్ర' మూవీతో హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
ఇదీ చదవండి: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి