Taraka Ratna acted as Lord Siva Devotee: నందమూరి తారకరత్న సుమారు 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని భావించిన ఆయన గత కొద్దిరోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఒక పర్యటనకు వెళ్లి హాట్ టాపిక్ గా మారిన తారకరత్న అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా అవసరమైతే ప్రచారానికి వస్తారని కూడా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న రోజు హార్డ్ స్ట్రోక్ కి గురవటం అక్కడి నుంచి ఆయనను బెంగళూరు ఆసుపత్రికి, తరలించడం ఆ తర్వాత ఆయన చికిత్స తీసుకున్న సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తారకరత్న కెరీర్ లో ఒకే ఒక్క భక్తిరసమైన చిత్రంలో నటించారు దాని పేరు మహా భక్త సిరియాల. ఈ సిరియాల తెలుగు వ్యక్తి కాదు కన్నడ రాష్ట్రానికి చెందిన ఒక మహా శివ భక్తుడు.  ఆయన జీవిత కథలోనే తారకరత్న హీరోగా నటించగా ఆయన భార్య పాత్రలో హీరోయిన్ అర్చనా నటించింది.


అలా శివుడి భక్తుడిగా ఏకైక భక్తి రస చిత్రంలో కనిపించిన తారకరత్న అదే శివరాత్రి నాడు శివైక్యం అయ్యాడు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ సినిమాకి లిరిక్ రైటర్ గా పనిచేసిన చైతన్య ప్రసాద్ ఒక ఎమోషనల్ నూట తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.మీ అకాల నిష్క్రమణం చాలా బాధాకరం, కలిసిన ప్రతిసారీ మీరు చూపిన మర్యాదా మన్ననలు మరువలేనివని అన్నారు. మీతో నేను పని చేసినది ఒకే ఒక్క సినిమా అదే 'మహాభక్త సిరియాళ, అందుకాలో నేను రాసినవి రెండే రెండు పాటలు అందులో చివరి పాట గుర్తుకు వస్తోంది అంటూ ఆయన షేర్ చేశారు. 
ఈ దేహము ఈ ప్రాణము ఈ జీవితమూ
పరమ శివుని పదములకే అవి అంకితమూ
శివుని ఆన లేనిదే - చీమైనా కుట్టదూ
భవుని పిలుపు రానిదే - భవ బంధం వీడదూ
ఆత్మ శుద్ధి కోసమే 
ఆ దేవుని శోధన
అయినా వీడదు ఎపుడూ
ఈ జీవుని వేదన " 
తారక రత్న గారూ! సినిమా సందర్భానికి పాట అలా రాసాను కానీ శివరాత్రి నాడు మీరిలా, అస్సలు ఊహించలేదు. భారమైన మనసుతో శిరసా నమస్కరించి వీడ్కోలు పలకడం తప్ప ఏం చేయగలం !  సెలవు 🙏


Also Read: Taraka Ratna Last Movie: తారకరత్న నటించిన చివరి సినిమా.. పాత్రేమిటో తెలుసా?


Also Read: Nandamuri Taraka Ratna's Deadbody: మోకిలలోని స్వగృహానికి తారక రత్న పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook