Nandamuri Taraka Ratna's Deadbody: మోకిలలోని స్వగృహానికి తారక రత్న పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..

Nandamuri Taraka Ratna's Deadbody: ఆదివారం ఉదయం తెల్లవారుజామున సమయానికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని మోకిలలో ఉన్న తారక రత్న స్వగృహానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. మోకిలలోని స్వగృహానికి నందమూరి తారక రత్న పార్ధివదేహం వస్తోందని ముందే తెలుసుకున్న నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 08:55 AM IST
Nandamuri Taraka Ratna's Deadbody: మోకిలలోని స్వగృహానికి తారక రత్న పార్థివదేహం.. అంత్యక్రియలు ఎప్పుడంటే..

Nandamuri Taraka Ratna's Deadbody: నందమూరి తారక రత్న గుండెపోటుతో ఆస్పత్రిపాలై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం నిన్న శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో మరోసారి తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి తారక రత్న పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం తెల్లవారుజామున సమయానికి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని మోకిలలో ఉన్న తారక రత్న స్వగృహానికి తరలించారు. మోకిలలోని స్వగృహానికి నందమూరి తారక రత్న పార్ధివదేహం వస్తోందని ముందే తెలుసుకున్న నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

ఈ రోజంతా నందమూరి తారక రత్న పార్థివదేహాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం ఆయన స్వగృహంలోనే ఉంచి రేపు సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌కి తరలించనున్నారు. నందమూరి అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నందమూరి తారక రత్న పార్థివదేహాన్ని ఫిలించాంబర్‌లోనే ఉంచి ఆ తరువాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంకు తరలించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు నందమూరి తారక రత్న అంత్యక్రియలు జరగనున్నాయి. 

నందమూరి కుటుంబంలో అతి కొద్దికాలంలోనే రెండో విషాదం
నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో అతి కొద్దికాలంలోనే రెండో విషాదం చోటుచేసుకున్నట్టయింది. గతేడాది ఆగస్టు 1న స్వర్గీయ నందమూరి తారక రామా రావు చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఉమా మహేశ్వరి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉమా మహేశ్వరిది సహజ మరణం కాదనే అనుమానాలు వినిపించాయి. 

ఉమా మహేశ్వరి మృతి తరువాత నందమూరి కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది అని అందరూ అనుకుంటున్న సమయంలోనే కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన పాద యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారక రత్న.. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఇప్పుడు ఇలా నందమూరి తారక రత్న మృతి రూపంలో మరోసారి ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Trending News