Taraka Ratna Children Details: సినీ నటుడు నందమూరి వంశానికి చెందిన తారకరత్న సుమారు 23 రోజుల పాటు చావుతో పోరాడి నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఒక్కతే కుమార్తె అని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయనకు ముగ్గురు సంతానం అనే విషయం తాజాగా వెల్లడైంది. వాస్తవానికి తారకరత్న అలేఖ్య రెడ్డి అనే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ని వివాహం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి అలేఖ్య రెడ్డికి అంతకుముందే వివాహమై ఆమె విడాకులు తీసుకున్నారు. మాజీ మంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డిని అలేఖ్య రెడ్డి వివాహం చేసుకోగా తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకున్నారు. నందీశ్వరుడు సినిమాకి అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయగా ఆ సినిమాలో తారకరత్న హీరోగా నటించారు ఆ సినిమాకు పని చేస్తున్నప్పుడు వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహం చేసుకోవాలి అనుకున్నారు. అయితే వీరి వివాహానికి అటు నందమూరి కుటుంబం నుంచి అలాగే అలేఖ్య రెడ్డి కుటుంబం నుంచి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.


ఇప్పటికే అమ్మాయిని ఒకసారి రాజకీయ కుటుంబానికి ఇస్తే ఇబ్బంది పడింది ఇప్పుడు మరో సినీ రాజకీయ కుటుంబానికి ఇవ్వడం ఇష్టం లేదని అమ్మాయి తరఫు వారు అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బయటివారు వద్దని భావించి వారు కూడా దూరం పెట్టారు. అయితే తారకరత్న మాత్రం అలేఖ్య రెడ్డి కోసం అన్ని వదులుకొని బయటకు వచ్చేసి సినిమాలు చేస్తూ ఆమెను పోషిస్తూ వచ్చారు. అలేఖ్య రెడ్డి తారకరత్నకు నిష్క అనే ఒక కుమార్తె ముందుగా జన్మించారు.


ఆమె గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు. అయితే తర్వాత వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారు. అందులో ఒక కుమారుడు కాగా మరొక కుమార్తె ఉన్నారు. అంటే తారకరత్న అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం అన్నమాట. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి లేని వారయ్యారంటూ నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలేఖ్య రెడ్డి తండ్రికి ఏపీ వైసీపీకి చెందిన కీలక నేత ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తోడల్లుడు అవుతారు. అంటే ఆయన కూడా అలేఖ్య రెడ్డికి తండ్రి వరుస అవుతారు. నందమూరి తారకరత్నకు మామయ్య వరుస అవుతారు. ప్రస్తుతానికి మోకిలాలోనే తారకరత్న స్వగృహంలో విజయసాయిరెడ్డి కూడా ఉండి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Taraka Ratna Death Reason: తారకరత్న చావుకు అదే కారణం.. అసలు ఏమైందంటే?


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook