Taraka Ratna Last Movie: తారకరత్న నటించిన చివరి సినిమా.. పాత్రేమిటో తెలుసా?
Taraka Ratna Last Movie: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ వై హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్న చనిపోయారు, అయితే ఆయన చివరి సినిమా ఏమిటో తెలుసా?
Taraka Ratna Last Movie S5 No Exit: గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని నారాయణ వై హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్న కన్నుమూశారు. దీంతో నందమూరి అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది ఆయన. పార్థివదేహాన్ని ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మహాప్రస్థానంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే తారకరత్న చివరిగా నటించిన సినిమా ఏది అంటే అది ఎస్ ఫైవ్ నో ఎగ్జిట్ అనే చెప్పాలి. తారకరత్న ప్రిన్స్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాలో సునీల్, అలీ, సాయికుమార్, గబ్బర్ సింగ్ సాయి, ఫిష్ వెంకట్, రఘుబాబు వంటి వారు ఇతర ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సాయి కుమార్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటారు. తన పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాననే ఉద్దేశంతో అందుకు దేనికైనా తెగిస్తాడు ఎందుకైనా రెడీ అనే తన కొడుకుని వైజాగ్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని పంపిస్తాడు. అతనితో పాటు అతను అనుచరులు ఐదుగురు కూడా బయలుదేరుతారు.
అలా బయలుదేరిన సాయి కుమార్ కొడుకు పాత్రలో తారకరత్న నటించాడు. తన తండ్రికి రాజకీయంగా అండగా ఉంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు పాటుపడే వ్యక్తిగా తారక రత్న కనిపించాడు. ఇక ఆ సినిమా గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోవడంతో అసలు ఈ సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఇక గత ఏడాది తారకరత్న ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చారు.
ఆయన 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించగా అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దానికి సంబంధించిన సెకండ్ సీజన్ కూడా స్ట్రీమ్ అవ్వబోతున్నట్లుగా అప్పట్లో ప్రకటించారు. కానీ తారకరత్న మృతితో ఆ సిరీస్ స్ట్రీమింగ్ జరుగుతుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక తారకరత్న చివరిగా నటించిన ఎస్ ఫై నో ఎగ్జిట్ సినిమాకి ప్రతాపరెడ్డి, శామ్యూల్, రహీం, గౌతం, మిల్కీ రెడ్డి వంటి వారు నిర్మాతలుగా వ్యవహరించగా భరత్ కోమలపాటి అలియాస్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా వ్యవహరించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 30వ తేదీన విడుదల అయింది.
Also Read: Taraka Ratna Rare Photos: మీరు మునుపెన్నడూ చూడని తారకరత్న రేర్ ఫోటోలు
Also Read: Taraka Ratna Biography: మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook