Taraka Ratna Wife Alekhya Reddy తారకరత్న మరణించిన తరువాత అతని భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న పోస్టులు, చెబుతున్న విషయాలు, జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, పడ్డ బాధలను తెలుసుకుని అందరూ కదిలిపోతోన్నారు. కుటుంబం అంతా కూడా వెలివేసిందంటూ, అయినా ధైర్యంగా నిలబడి బతికామంటూ అలేఖ్యా రెడ్డి చెబుతున్న విషయాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూనే వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా అలేఖ్యా రెడ్డి తన కొడుకు నిష్క నందమూరి గురించి చెప్పింది. తాను కూడా తండ్రిలానే ఎదుగుతాను అని తండ్రి ఫోటోను పట్టుకుని సంబరపడిపోతోన్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోను షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది అలేఖ్యా రెడ్డి. ఇలా భర్త జ్ఞాపకాలతో, పిల్లలతో జీవితాన్ని గడిపేస్తానంటూ పరోక్షంగా అలేఖ్యా రెడ్డి చెప్పకనే చెప్పేసింది.


[[{"fid":"267442","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


తారకరత్న మరణానంతరం అలేఖ్యా రెడ్డి ఎన్నో విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఎక్కడ, ఎలా కలిశారు.. డేటింగ్ చేయడం, ఆ తరువాత పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవం, ఎంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఒంటరిగా జీవించడం, కుటుంబం నుంచి ఎలాంటి ఆదరణ లేకపోయినా సంతోషంగా బతకడం వంటివి చెబుతూ అందరినీ కదిలించింది.


[[{"fid":"267443","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


తమకు కష్టాలు వస్తే వచ్చిన ఏకైక వ్యక్తి బాలయ్య బాబు అని బాలయ్య తమకు దేవుడు వంటి వాడు అని అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చింది. ఇక విజయసాయి రెడ్డి సైతం తన కుటుంబానికి అండగా నిలిచాడంటూ అలేఖ్యా రెడ్డి తెలిపింది. తారకరత్న పేరు మీద బాలయ్య చేస్తోన్న ఉచిత వైద్యం గురించి తెలిసిన అలేఖ్య రెడ్డి చలించిపోయింది. బాలయ్య దేవుడు అంటూ దండం పెట్టేసింది.


అలా ప్రతీ సారి బాలయ్య తమ కుటుంబానికి చేసిన సాయం, అండగా నిలబడిన తీరు గురించి అలేఖ్యా రెడ్డి చెబుతూనే వస్తోంది. బాలయ్యకు సైతం తారకరత్న అన్నా, ఆయన కుటుంబం అన్నా కూడా ఎంతో ఆప్యాయత ఉంటుంది. అందుకే ఆ కుటుంబ బాధ్యత తనది అని బాలయ్య అందరి ముందు చెప్పేశాడట.


Also Read:  Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?


Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్‌ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook