Tees Maar Khan movie Teaser Released: 'ప్రేమకావాలి' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్‌.. మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. లవ్లీ, సుకుమారుడు వంటి యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీతో కెరీర్‌ ఆరంభంలోనే వరుస హిట్స్‌ అందుకున్నాడు. ఆపై వచ్చిన రఫ్, గరం, చుట్టాలబ్బాయి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి లాంటి సినిమాలతో వరుస పరాజయాలు అందుకున్నాడు. శశి సినిమాతో పర్వాలేదనిపించిన ఆది.. మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే విభిన్న కథాంశంతో వచ్చిన 'నాటకం' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో 'తీస్‌ మార్‌ ఖాన్‌' చేస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తీస్‌ మార్‌ ఖాన్‌ సినిమాలో ఆది.. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మించారు. సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్ కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.  క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.



ఒక నిమిషం 35 సెకండ్ల నిడివిగల తీస్‌ మార్‌ ఖాన్‌ టీజ‌ర్‌.. 'మా అన్న ఏమైపోయాడో.. ఆఫీస్‌కు వెళ్లిన మా అన్న తిరిగి రాలేదు' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. 'మ‌నం ఆప‌ల‌నుకున్నంత ప‌వ‌ర్ మ‌న ద‌గ్గ‌రున్న.. మ‌నం ఆప‌లేనంత ప‌వ‌ర్ వాడి ద‌గ్గ‌రుంది', 'రాక్ష‌సుడికి ర‌క్ష‌కుడు అంటే ఏంటో చూపించండి', 'ఏ పాప.. మరీ ఇంత పబ్లిక్‌లో! మీ ఇంట్లో లేదా మా ఇంట్లో అయితే బాగుంటుంది', 'బాగా రాసుకోండి. బాగా కనబడాలి' అనే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 


Also Read: Jos Buttler: రెండు బంతుల్లో ప్రపంచ రికార్డ్‌ మిస్‌ చేసుకున్న జోస్‌ బట్లర్‌.. టాప్‌లోనే ఏబీ డివిలియర్స్‌!   


Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook