Mahesh Babu Guntur Karam Movie Tickets: మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్స్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 12వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మంగళవారం గుంటూరు వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తరువాత సినిమా వస్తుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా గుంటూరు కారం మూవీ టీమ్‌కు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా బెన్ ఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ అర్థరాత్రి 1 గంట బెన్ ఫిట్ షోకు రాష్ట్రంలో 23 చోట్ల ప్రదర్శనలకు ఒకే చెప్పింది. ఆరో షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 4 గంటల షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీరోల్స్ పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. తమన్‌ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ప్రమోషన్ పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తో మహేష్ బాబు ఫ్యాన్స్‌ ఉత్సాహం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ట్రైలర్‌లో లుక్, మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ స్థాయి వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల (3.9 కోట్లు)కు పైగా వ్యూస్ తెచ్చుకొని ఈ ట్రైలర్ ఆల్‍టైమ్ రికార్డ్ సృష్టించింది. ట్రైలర్‌లో మహేశ్‌ బాబు డైలాగ్స్‌ తెగ అలరిస్తున్నాయి. మహేశ్ బాబు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని.. సినిమా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook