Telugu Film Chamber Directed to hide OTT Partner Names in Movie Titles: గత కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు ఓటీటీలు టెన్షన్ పెడుతున్నాయి. తెలుగు సినిమా విడుదలైన మూడు నాలుగు వారాలకే డిజిటల్ వేదికగా అందుబాటులోకి వస్తూ ఉండడంతో థియేటర్ల వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుందంటూ తెలుగు సినీ నిర్మాతలు సహా థియేటర్ల యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ హిట్లుగా నిలిచిన పుష్ప లాంటి సినిమాలను కూడా చాలా త్వరగా ఓటీటీలో విడుదల చేయడం వల్ల థియేటర్లకు కలెక్షన్స్ తగ్గిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకే ఇప్పుడు సినీ నిర్మాతలు అందరూ చర్చించుకుని ఎలాంటి సినిమా అయినా సరే సినిమా విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలను ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం సినిమా విడుదల సమయంలో ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్(ఓటీటీ)కి సినిమా ఇచ్చాము? అలాగే ఏ శాటిలైట్ ఛానల్ కి సినిమా అమ్మాము, అనే విషయాలను కూడా ప్రస్తావించకూడదని పేర్కొన్నారు.


ప్రస్తుతానికి ఫలానా ఓటీటీ సంస్థలో మా డిజిటల్ పార్ట్నర్  అని, ఫలానా ఛానల్ మా శాటిలైట్ పార్ట్నర్ అంటూ సినిమా టైటిల్స్ లోనే ఏ ఓటీటీలో సినిమా రాబోతోంది? ఏ ఛానల్ లో సినిమా రాబోతుంది? అనే విషయాన్ని రివీల్ చేస్తున్నారు. దీంతో ఏ ఓటీటీలో వస్తోంది, లేదా ఏ టీవీలో వస్తుంది? అని ముందే రివీల్ చేయడం వలన మన దగ్గర ఎలాగో ఆ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంది, లేదా టీవీలో వచ్చినప్పుడు చూడవచ్చు అంటూ ఒక వర్గం లైట్ తీసుకుంటున్నారు అని కూడా నిర్మాతలు ఆలోచించినట్లు తెలుస్తోంది.


ఈ విషయాన్ని కొందరు నిర్మాతలు నిర్మాతలు మండలి దృష్టికి తీసుకు రావడంతో ఓటీటీ ఎనిమిది వారాల తర్వాత విడుదల చేయాలని, అలాగే ఇందులో విడుదల చేస్తున్నామనే విషయాన్ని సినిమా రిలీజ్ అయినప్పుడు టైటిల్స్ తో పాటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అంశం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా సినిమా రిలీజ్ సమయంలో కూడా తమను ప్రమోట్ చేయరు అని తెలుసుకున్న ఓటీటీ ప్లాట్ ఫారం నిర్వాహకులు అలాగే చానల్స్ నిర్వాహకులు నిర్మాతల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: Chandrababu Wishes to Pawan Kalyan: బాబుకు ఎన్టీఆర్ కంటే పవనే ఎక్కువయ్యారా?


Also Read: No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి