Telugu Film producer Dil Raju is going to be a father once again : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి తెలుగు ఇండస్ట్రీ వర్గాలు. దిల్ రాజు రెండో భార్య  వైఘా రెడ్డి (తేజస్విని) ప్రస్తుతం గర్భవతి అని, త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక విషయం తెలుసుకున్న నెటిజన్లు బడా నిర్మాత దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన రెండేళ్లు కుంగిపోయారు. ఒక్కో సమయంలో బయటికి రావడానికి కూడా ఆసక్తి చూపలేదు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. తండ్రి దిల్ రాజుకు రెండో వివాహం చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కొద్దిమంది బంధువుల సమక్షంలో దిల్ రాజు, తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు. 


51 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు.. తాజాగా తండ్రి కాబోతున్నాడట. తేజస్విని ప్రస్తుతం నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక దిల్‌ రాజ్ కూతురు హన్షితా రెడ్డికి ఇప్పటికే పెళ్లయ్యింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మేనస్.. దిల్ రాజు మనవడు.


దిల్ రాజు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో దిల్ రాజు పాన్‌ ఇండియా చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం శంకర్-చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజుకు 50వ చిత్రం. అందుకే ఆయన ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.


Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!


Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook