Telugu Film Producers Council Shock to Dil Raju: తెలుగులో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. 2023 సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అలాగే బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమాలు విడుదల ఎందుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ముందు రిలీజ్ చేస్తామని ప్రకటించి తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు అదే సమయంలో ఏజెంట్ సినిమాని కూడా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాతగా నిర్మించిన వారసుడు సినిమాని కూడా అదే సమయంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాని మొదట బై లింగ్యువల్ మూవీ అని చెప్పినా సరే తరువాత ఈ సినిమాని తమిళ రిలీజ్ సినిమా అని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ తమిళ సినిమాను తమిళనాడులో డైరెక్ట్గా రిలీజ్ చేయడం కాస్త ఈజీనే. టాక్సులు కాస్త తక్కువగా ఉంటాయి. అదే తెలుగు నుంచి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే భారీ ఎత్తున టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేసిన సమయంలో కూడా వారసుడు సినిమా షూటింగ్ జరిపారు.  దానికి చెప్పిన కారణం కూడా మాది తమిళ సినిమా అని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాం కాబట్టి తెలుగు సినిమా కాదని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.


అయితే ఇప్పుడు వారసుడు సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ఆయన ఇప్పటికీ థియేటర్ బ్లాక్ చేయడం మొదలుపెట్టినట్లు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అదేమిటంటే తెలుగు చలనచిత్ర పెరిగిన నిర్మాణం దృష్టిలో పెట్టుకొని నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 2017న జరిగిన అత్యవసర సమావేశంలో సంక్రాంతి, దసరా పండుగలకు స్ట్రైట్ తెలుగు సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.[[{"fid":"252218","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దిల్ రాజు కూడా 2019లో ఒక మీడియా సమావేశంలో స్ట్రెయిట్ సినిమాలో ఉండగా డబ్బింగ్ సినిమాలు థియేటర్స్ ఎలా ఇస్తామని ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రకారమే స్ట్రైట్ సినిమాలు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని పేర్కొన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని విధిగా అమలుపరచాలని తెలుగు చిత్రం పరిశ్రమ కాపాడుకుంటూ స్ట్రైట్ గా తీసిన తెలుగు చిత్రాలకు ప్రథమ ప్రధాన్యత ఇస్తూ మిగిలిన వాటిని మాత్రమే డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి దసరా పండుగల సమయంలో కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎగ్జిబిటర్స్ ను కోరుతున్నామంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.


కచ్చితంగా ఇది దిల్ రాజుకు కౌంటర్ గాని ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ఎందుకంటే గతంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి దిల్ రాజు వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు ఆ సమయంలో ఈ మేరకు కామెంట్స్ చేశారు. కానీ ప్రస్తుతానికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా అశోక్ కుమార్, వైవిఎస్ చౌదరి వైస్ ప్రెసిడెంట్స్ గా వ్యవహరిస్తున్నారు. సెక్రటరీలుగా ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల వ్యవహరిస్తున్నారు.


Also Read: బిగ్ బాస్ ఇంట్లో ఇకపై అందం కనుమరుగు.. చివరి నిమిషంలో మార్పు.. కారణం అదేనా?


Also Read: Baladiya Buzz Interview : గీతూ ఎలిమినేషన్.. బాలాదిత్య కామెంట్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook