Telugu Film Producers Council -TFPC Elections on Febraury 19th: ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ చరిష్మా ప్రపంచ స్థాయికి చేరింది, విదేశాల్లో సైతం మన సినిమాలు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకపక్క తెలుగు సినిమా చరిష్మా పెరుగుతూ వెళుతుంటే తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం లుకలుకలు అప్పుడప్పుడు బయట పడుతున్నాయి. ఆ మధ్య ఏకంగా సినిమా నిర్మాణ వ్యయాలు పెరిగిపోయాయి అంటూ షూటింగ్స్ నిలిపివేస్తే కొద్దిరోజుల క్రితం  తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరపడం లేదు అంటూ నిర్మాతలు కొందరు రిలే నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటూ వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఉన్న  తెలుగు నిర్మాతల మండలి కావాలనే ఈ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారని వారంతా నిరాహారదీక్షలకు దిగారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఫిబ్రవరి 19 న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉందని, అది ఎప్పుడూ బాగుండాలి అనేది మా కోరిక అని అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నామని ఈ క్రమంలో సీ కళ్యాణ్ వెల్లడించారు. ఎలక్షన్స్ కోసం ఒక పది మంది సభ్యులు టెంట్ లు వేశారని ఆయన ఎద్దేవా చేశారు.


ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, ఫిబ్రవరి 19న ఎన్నికలు, అదే సాయంత్రం కౌంటింగ్ అదే రోజు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కమిటీ పై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని, అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.


మా ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోమని పేర్కొన్న కళ్యాణ్ ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది ఏదో రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఇక తనకు ఎలాంటి పదవి వ్యామోహం లేదన్న ఆయన మా కౌన్సిల్ లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉందని అన్నారు. ఇక ఇంత అమౌంట్ పోవడానికి కారణం... దాసరి నారాయణ రావు గారే అని కళ్యాణ్ వెల్లడించారు. మా సభ్యులు కె సురేష్ బాబుని మూడు సంవత్సరాలు, యలమంచిలి రవి చంద్ ను జీవిత కాలం బహిష్కరిస్తున్నామని సీ కళ్యాణ్ వెల్లడించారు. 


Also Read: Kushboo Sundar in Varisu : కుష్బూని లేపేశారు.. పది కోట్లు వృథా.. దిల్ రాజుపై వంశీ పైడిపల్లి దెబ్బ


Also Read: Aishwarya Rai notice: ఐశ్వర్యా రాయ్ కి షాకిచ్చిన అధికారులు.. కోట్లున్నా 20 వేలు కట్టలేరా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.