Vishwa Karthikeya: ఇండోనేషియన్ ప్రాజెక్టులో తెలుగు హీరో.. జాక్‌పాట్ కొట్టేసిన యువ నటుడు
Vishwa Karthikeya in Indonesian Project: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ కార్తికేయ ఇండోనేషియా ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశాడు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో రిలీజ్ కానుంది.
Vishwa Karthikeya in Indonesian Project: ప్రస్తుతం తెలుగు సినిమాల గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. మన హీరోలు, దర్శకుల టాలెంట్‌తో టాలీవుడ్ ఖ్యాతి రెపరెపలాడుతోంది. హాలీవుడ్ మేకర్లు సైతం టాలీవుడ్ గురించి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మన తెలుగు హీరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో ఆఫర్ కొట్టేశాడు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విశ్వ కార్తికేయ.. కలియుగం పట్టణంలో అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆయుషీ పటేల్ ఇండోనేషియన్ ప్రాజెక్టులో హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 50కి పైగా సినిమాల్లో బాలనటుడిగా విశ్వ కార్తికేయ నటించాడు.
నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు వంటి సినిమాల్లో అలరించాడు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు విశ్వ కార్తికేయ. ఈ సినిమాలో ఆయుషి పటేల్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరిద్దరు హీరో హీరోయిన్స్‌గా ఛాన్స్ కొట్టేశారు.
‘శూన్యం చాప్టర్ 1’ అంటూ ఈ మూవీ హిందీ, ఇండోనేషియన్ భాషల్లో విడుదల కానుంది. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సీకే గౌస్ మోదిన్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter