2024 Sankranthi: అందరి హీరోల కన్నూ 2024 సంక్రాంతి మీదే.. కానీ ఎన్టీఆర్ మాత్రం?
All Telugu heros Aiming 2024 Sankranthi: రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సహా అనేక మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి 2024 సీజన్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
All Telugu heros Aiming 2024 Sankranthi: సంక్రాంతి తెలుగువారందరికీ చాలా పెద్ద పండుగ, అలాగే తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు కూడా మంచి సీజన్. అందుకే పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేకుండా సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్లుగా నిలిచాయి. అయితే 2024 సంక్రాంతి మీద భారీ ఎత్తున స్టార్లు కన్నేసినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ సహా అనేక మంది స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి 2024 సీజన్లో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాత కావడంతో సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసేందుకు దాదాపుగా ఆయన కన్నేసినట్లుగానే తెలుస్తోంది.
అయితే మహేష్ బాబు 28వ సినిమా ఆగస్టు నెలలో విడుదల చేయాలని చెబుతున్నా సరే షూట్ లేట్ అవుతూ ఉన్న కారణంగా దాన్ని కూడా సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఏ మాత్రం లేకపోలేదని అంటున్నారు మరోపక్క ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాని కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అలాగే పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసమే ఈ వేసవి కాలంలో ఒక సినిమా ప్రారంభించి తాను కూడా బరిలో ఉన్నానని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంత మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నా ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఎన్టీఆర్ అసలు ఈ సంక్రాంతి బరిలో దిగుతాడా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు అసలు ఎప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
Also Read: Taraka Ratna Latest Health Update: తారకరత్న సేఫ్, 10 వారాలు విశ్రాంతి అవసరం కాసేపట్లో వైద్యుల ప్రకటన?
Also Read: Biggest Indian Film: ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం.. ఇక మామూలుగా ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook