Telugu Movies Releasing this Week: ఈ వారం పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సినిమాలు అన్ని విడుదలవగా ఇప్పట్లో పెద్ద సినిమాలు వచ్చే దాఖలాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా మార్చి మూడో తేదీన థియేటర్లలో వ్యవస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు పేరుతో ఒక సినిమా రిలీజ్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామెడీ చిత్రాల దర్శకుడుగా పేరు ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్., మీనా, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, తమిళ హీరోయిన్ మృణాళిని రవి ప్రధాన పాత్రధారులుగా నటించారు. మృణాళిని రవి తండ్రి రాజేంద్ర ప్రసాద్ కాగా సోహైల్తో ప్రేమలో పడిన మృణాళిని తండ్రిని ఎలా ఒప్పించి వివాహం చేసుకున్నది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక మరో పక్క నవీన్ నేని హీరోగా కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో నటించిన ప్రణీత పట్నాయక్ హీరోయిన్ గా రిచీ గాడి పెళ్లి అనే సినిమా తెరకెక్కింది.


ఈ సినిమా కూడా మార్చి మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా దిల్ రాజు నిర్మాణంలో బలగం అనే సినిమా రూపొందింది జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి ఈ సినిమా తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమా థియేటర్లలోకి మార్చి మూడో తేదీన వచ్చేస్తోంది. ఇక ఈ సినిమాలో కాకుండా రితికా సింగ్ హీరోయిన్ గా నటించిన ఇన్ కార్ అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో రితికా సింగ్ ఒక అత్యాచార బాధితురాలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


హర్షవర్ధన్ ఈ సినిమాకు రచనా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా హిందీ తెలుగు భాషల్లో మార్చి మూడవ తేదీనే విడుదలవుతోంది. ఇక ఇవి కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతుంది. మార్చి 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఆవూతఁడగా మరోపక్క పులి 19 సెంచరీ అనే మరో సినిమా కూడా మార్చి 3న రిలీజ్ అవుతుంది. మలయాళం సినిమాని తెలుగులో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.ఇవండీ ఈవారం ధియేటర్లలో విడుదలవుతున్న సినిమా విశేషాలు. వచ్చేవారం ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి అనేది మరో ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాం.


Also Read: Dvv Daanayya Missing: డీవీవీ దానయ్య ఎక్కడ.. ఆర్ఆర్ఆర్ అవార్డులు కూడా అందుకోలేనంత బిజీనా?


Also Read: Jr NTR Unhappy: హెచ్సీఏ వ్యవహారంలో ఎన్టీఆర్ అసహనం.. రంగంలోకి జక్కన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి