Dvv Daanayya Missing: డీవీవీ దానయ్య ఎక్కడ.. ఆర్ఆర్ఆర్ అవార్డులు కూడా అందుకోలేనంత బిజీనా?

Dvv Daanayya Not attending RRR Related Events: ఆర్ఆర్ఆర్ అనేక అవార్డులు అందుకుంటున్నా ఆ సినిమా నిర్మాత దానయ్య కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 28, 2023, 10:37 PM IST
Dvv Daanayya Missing: డీవీవీ దానయ్య ఎక్కడ.. ఆర్ఆర్ఆర్ అవార్డులు కూడా అందుకోలేనంత బిజీనా?

Why Dvv Daanayya Not attending RRR Related Events: ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ లో కూడా వినిపిస్తున్న పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో 2018వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. కరోనా సహా అనేక అవాంతరాలను ఎదుర్కొని 2022 మార్చి 23వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదలైంది ఆర్ఆర్ఆర్. అప్పుడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ లభించింది, కానీ ఎప్పుడైతే డిజిటల్ వేదికగా నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులందరూ ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సహా ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందా అని అనుమానపడే విధంగా హాలీవుడ్ నుంచి ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్ అవార్డుల వరకు వెళ్ళవచ్చు అని అభిమానుల నుంచే ప్రోత్సాహం లభించడంతో సినిమా యూనిట్ కూడా అందుకు ప్రయత్నాలు చేసింది. అందుకు అనుగుణంగానే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ కూడా నామినేట్ అయింది. అయితే ఆస్కార్ వ్యవహారం ఇలా ఉంటే ఆస్కార్ పక్కన పెడితే గోల్డెన్ లోపు అవార్డులు క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు అంటూ అనేక అవార్డులు ఈ సినిమాను వరించాయి.

ఈ అవార్డులు అందుకునేందుకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి, రాజమౌళి కుమారుడు కార్తికేయ వంటి వారు విదేశాలకు వెళ్లి సందడి చేస్తున్నారు. కానీ ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ప్రస్తావన మాత్రం ఎక్కడా లేకుండా పోయింది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మించక ముందు కూడా డివివి దానయ్యకు తెలుగులో మంచి నిర్మాతగా పేరు ఉంది. కానీ ఈ సినిమా దెబ్బకు ఆయనకు మంచి పాపులారిటీ అయితే లభించింది, కానీ ఆయన కాస్త ఇంట్రోవర్ట్ టైప్ కావడంతో ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్స్ లో సైతం మాట్లాడడానికి తడబడిన పరిస్థితులు చూశాం. ఈ నేపథ్యంలోనే ఆయనను విదేశాలకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని రాజమౌళి ఆయనను బలవంతం చేయలేదని తెలుస్తోంది.

ఆయన తరపు కూడా తానే అవార్డులు అందుకుంటూ తన సినిమాని ఇంకా తన భుజాల మీద ఎక్కువగా మోస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం ఈ విషయాలు తెలియవు కాబట్టి ఇదేంట్రా బాబు నిర్మాత లేకుండా వీళ్లే డబ్బా కొట్టుకుంటున్నారు అనే కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ దానయ్య అంత త్వరగా జనాల్లో కలిసిపోలేరు కాబట్టి అలాగే ఆయన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టి ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు మరోపక్క నానితో కూడా ఒక సినిమా సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆయా సినిమాల పనుల్లో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ ఆయనకేదో అన్యాయం జరిగిపోయింది అనే వాదన బేస్లెస్ అని సినీ వర్గాల వారు పేర్కొంటున్నారు.

Also Read: Genelia D'souza Kids Doing Namaste: ఇదే కదా సంస్కారం అంటే.. ఫోటోగ్రాఫర్లకు జెనీలియా పిల్లలు నమస్కారం!

Also Read: Naga Shaurya Fight: లవర్ ను రోడ్డుపై కొట్టిన యువకుడు.. రచ్చ చేసిన నాగశౌర్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News