Telugu Movies in May 2023 ప్రతి సంవత్సరం సమ్మర్ సందర్భంగా టాలీవుడ్‌ లో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవ్వడం జరుగుతుంది. అందులో స్టార్‌ హీరోల సినిమాలు కనీసం మూడు నాలుగు అయినా ఉంటాయి. కానీ ఈసారి సమ్మర్‌ స్పెషల్‌ గా స్టార్‌ హీరోల సినిమాలు లేవనే చెప్పాలి. గత నెలలో సమంత నటించిన శాకుంతలం తో పాటు మరో రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న బడ్జెట్‌ చిత్రంగా రూపొంది విడుదల అయిన విరూపాక్ష చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్న విషయం తెల్సిందే. సమ్మర్‌ సీజన్ ప్రారంభం అయ్యి నెల దాటినా కూడా ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్ ను టాలీవుడ్ దక్కించుకోలేక పోయింది. దాంతో మే నెలలో అయినా భారీ విజయాలు నమోదు అవుతాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ఏప్రిల్ నెలలో మాదిరిగానే మే నెలలో కూడా పెద్ద హీరోల సినిమాలు లేవు. ఈ నెల మొదటి శుక్రవారం అయిన మే 5న అంటే రేపు అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమాతో పాటు గోపీచంద్‌ నటించిన రామబాణం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా భారీ ఎత్తున ప్రమోషన్‌ చేశారు.


రెండు సినిమాల మేకర్స్ కూడా సక్సెస్ పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వారం మే 12న నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. కస్టడీతో పాటు మే 12న భువన విజయం.. మ్యూజిక్ స్కూల్‌.. చత్రపతి(హిందీ).. ది స్టోరీ ఆఫ్‌ బ్యూటీఫుల్ గర్ల్ ( తెలుగు) సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 


మే 18న సామజవరగమన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజున సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమా కూడా విడుదల కాబోతుంది. మే 19వ తారీకున బిచ్చగాడు 2 సినిమా రాబోతుంది. ఇక మే చివరి వారం లో నరేష్ పవిత్ర ముఖ్య పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి విడుదలకు సిద్ధంగా ఉంది. మే 26వ తారీకున ఆ సినిమావిడుదల కాబోతుంది. 


Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ


అదే రోజు నవీన్ పొలిశెట్టి అనుష్క కీలక పాత్రల్లో నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హనుమాన్ సినిమా కూడా ఇదే నెలలో రాబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నీ కూడా మీడియం బడ్జెట్‌ చిత్రాలు.. చిన్న సినిమాలే ఈ వారంలో రాబోతున్నాయి. కొన్ని సినిమాలు మంచి క్రేజ్ తో రాబోతున్నాయి.. కొన్ని సినిమాలు మాత్రం పెద్దగా బజ్ లేకుండా విడుదల అవుతున్నాయి. సమ్మర్‌ మొత్తం కూడా చిన్న సినిమాలతోనే సరిపోయింది.. కనీసం వచ్చే నెలలో అయినా స్టార్ హీరోల సినిమాలు రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.


Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook