Telugu Movies Releasing in Theatres and OTT this Week: ఎప్పటిలాగే ఈ వారంలో కూడా పలు ఆసక్తికరమైన సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఓ రంగం సిద్ధమైంది. మరీ ముఖ్యంగా తమిళ మూవీ కాతు వాకుల రెండు కాదల్ సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా నటించిన యశోద సినిమా ఈ శుక్రవారం అంటే 11వ తేదీన విడుదలవుతోంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి హరి, హరీష్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి, ఇటీవల సరోగసీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా దాన్నే ప్రధానంగా చూపనున్నట్టు తెలుస్తోంది.  ఇక అదే రోజు హాలీవుడ్ నుంచి వాకాండ ఫరెవర్ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగులో వర్షం సినిమా కూడా రీ రిలీజ్ అవుతోంది.


ఇక తెలుగు నుంచి మసూద, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, మది అనే మరో మూడు సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇక ఓటీటీ విడుదల విషయానికి వస్తే ఓటీటీలో కూడా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టు ప్రేక్షకులను పలకరించేందుకు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి బ్రీత్ అనే ఒక వెబ్ సిరీస్ నుండి కొత్త సీజన్ 2 రిలీజ్ అవుతుంది. ఆ సిరీస్ ఈ నెల 9వ తారీకు నుంచి అందుబాటులోకి రాబోతోంది.


ఇక మరోపక్క నెట్ ఫ్లిక్స్ లో లో ఫిఫా వరల్డ్ కప్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ఫిఫా వరల్డ్ కప్ నెట్ ఫిక్స్ లో అందుబాటులోకి రాబోతోంది. జి 5 యాప్ లో సేవింగ్స్ అకౌంట్ అనే సిరీస్ రాబోతోంది. ఇది నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే సోనీ లివ్ లో తనావ్ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతానికైతే మాకు అందిన సమాచారం అంతా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. 


Also Read: Anushka Shetty First Look: అన్విత రవళి శెట్టిగా మారిన అనుష్క శెట్టి.. బక్కచిక్కి షెఫ్ అవతారంలో!


Also Read: Adipurush Tension: ఆదిపురుష్ వాయిదా.. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ఫీలవుతున్న ఫ్యాన్స్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook