Telugu Movies Releasing This Week: ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు పలు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. ఈ వారం మూడు సినిమాలు ధియేటర్లలో విడుదలవుతున్నాయి. ముందుగా థియేటర్లలో విడుదలయ్యే సినిమాల గురించి పరిశీలిస్తే ఈ వారం థియేటర్లలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో మన తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించగా కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది. ఇక భీష్మ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న నితిన్ కూడా మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతోంది. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.


ఇక ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి స్వయంగా నిర్మించారు. ఇక గతంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 కూడా ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరం హీరోయిన్ గా పీపుల్స్ మీడియా, ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద ఈ సినిమా నిర్మితమైంది.


డిజిటల్ రిలీజులు: 
ఇక ఈ వారం డిజిటల్ వేదికగా ఏఏ సినిమాలు వెబ్ సిరీస్ లో విడుదలవుతున్నాయి అనే విషయం మీద ఒక లుక్కు వేస్తే డిజిటల్ వేదికగా జీ5 యాప్ లో హలో వరల్డ్ అని వెబ్ సిరీస్ రిలీజ్ అవుతోంది. నిహారిక కొణిదల నిర్మించిన ఈ హలో వరల్డ్ వెబ్ సిరీస్ లో ఆర్యన్ రాజేష్, సదా, మై విలేజ్ షో ఫేమ్ అనిల్, నిఖిల్ విజయేంద్రసింహ, నిత్య శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఆగస్టు 12న విడుదలవుతోంది.


ఇక అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించి స్వయంగా నిర్మించిన కడవర్ అనే ఫోరెన్సిక్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 12వ తేదీన డిస్నీ + హాట్ స్టార్లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతుంది. ఇక లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన హ్యాపీ బర్త్డే సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతోంది. ఇక రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ది వారియర్ సినిమా కూడా ఆగస్టు 11వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమవుతోంది. నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా కూడా ఆగస్టు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతుంది.


అలాగే సోనీ లివ్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన గార్గి సినిమా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండబోతోంది. ఇక ఆహాలో కూడా రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహా మనిషి’ అలాగే ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన మాలిక్ సినిమాలు ఆగస్టు 12వ తేదీన విడుదలవుతున్నాయి.


Also Read: Alia Bhatt: అలియా భట్ ఒక్క పోస్ట్ పెడితే అంత డబ్బా.. షాకింగ్ గా ఇన్స్టాగ్రామ్ ఆదాయం!


Also Read: Rajinikanth: ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజనీకాంత్.. ఇక రచ్చ రచ్చే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook