Alia Bhatt: అలియా భట్ ఒక్క పోస్ట్ పెడితే అంత డబ్బా.. షాకింగ్ గా ఇన్స్టాగ్రామ్ ఆదాయం!

ఇప్పుడు సినీ తారలకు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఆదాయ మార్గాలుగా మారిపోతున్నాయి. వారు ఒకపక్క సినిమాల్లో హీరోయిన్లుగా లేదా హీరోలుగా నటిస్తూ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ లు తీసుకుంటూనే తమ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ను బట్టి వారికి ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి దండిగా ఆదాయం లభిస్తున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:38 PM IST
 Alia Bhatt: అలియా భట్ ఒక్క పోస్ట్ పెడితే అంత డబ్బా.. షాకింగ్ గా ఇన్స్టాగ్రామ్ ఆదాయం!

Alia Bhatt Instagram Revenue: ఇప్పుడు సినీ తారలకు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఆదాయ మార్గాలుగా మారిపోతున్నాయి. వారు ఒకపక్క సినిమాల్లో హీరోయిన్లుగా లేదా హీరోలుగా నటిస్తూ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ లు తీసుకుంటూనే తమ సోషల్ మీడియా ద్వారా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ ను బట్టి వారికి ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి దండిగా ఆదాయం లభిస్తున్నట్లు సమాచారం.

తాజాగా అలియా భట్ వ్యవహారానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే అలియా భట్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదైనా కమర్షియల్ యాడ్ లేదా ఒక కమర్షియల్ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేయాలి అంటే 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఆమె ఒక్కో పోస్టుకు సుమారు కోటి రూపాయలు దాకా వెనకేసుకుంటోంది అని ఒకవేళ రణబీర్ తో కలిసి కనుక ప్రమోట్ చేస్తే దాని రేటు మూడు కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.

ఇక  ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి కమర్షియల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్లు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. ఎందుకంటే ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 68.5 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ కు చెందిన అలియా భట్ తెలుగు వారితో ఎక్కువగా కనెక్ట్ అవుతోంది. ఎందుకంటే ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర సరసన సీత అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న ఆమె ఇటీవల వివాహం చేసుకొని గర్భవతి కూడా అయింది. ఇక ఈ భామ తన భర్తతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

Read Also: Bimbisara: బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బింబిసార.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సీతారామం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Read Also: Rajinikanth: ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజనీకాంత్.. ఇక రచ్చ రచ్చే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News