New Movies Update: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం, జనాలు కూడా థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో వాయిదా పడిన పెద్ద మూవీస్​ ఈ వారం విడుదల కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..


ఈటీ: ఈ వారం రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. సూర్యా హీరోగా నటించిన 'ఈటీ' మూవీ ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది. సూర్య నటించిన ఆకాశమే హద్దురా, జై భీమ్​ వంటి సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. కాగా ఇప్పుడు ఈటీతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు సూర్యా. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్​ మోహన్​ నటించింది.


గత రెండు సినిమాలలానే.. ఈ సినిమా కూడా డిఫరెంట్​ కథతో రానున్నట్లు తెలుస్తోంది. ఆకాశమే హద్దురా, జై భీమ్ వంటి సినిమాలు నిజ జీవితం ఆధారంగా తెరకెక్కి ఘన విజయం అందుకున్నాయి. ఈటీ కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని భారీ ఆశలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్​, డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.


రాధే శ్యామ్​..


పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్​ ఈ నెల విడుదల కానుంది. నిజానికి సంక్రాంతి సందర్భంగా జనవరిలో రావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో ఈ నెల 11న మూవీ థియేటర్లలోకి రానుంది.


సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు.. హిందీలోను ఏకకాలంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళం, కన్నడా, మలయాళం భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్ ఏకకాలంలో విడుదలకానుంది.


రాధేశ్యామ్​ మూవీలో ప్రభాస్​ హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్​కు జోడీగా పూజా హెగ్దే నటించింది. లవ్  స్టోరీగా ఈ మూవీ  తెరకెక్కింది.


ఓటీటీల్లో వచ్చే సినిమాలు ఇవే..


ధనుష్​ హీరోగా నటించిన మారన్​ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ నెల 11న డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదల కానుంది. యాక్షన్​, థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ మూవీలో ధనుష్​ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్​ హీరోయిన్​గా నటించింది.


రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఖిలాడి' ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది. ఇప్పడు ఈ మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.


11వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఖిలాడీ మూవీ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో విడుదల కానుంది.


రైడర్, రౌడీ బాయ్స్​ సినిమాలు కూడా జీ 5లో ఈ నెల 11 నుంచి స్టరీమింగ్​కు అందుబాటులో ఉండనున్నాయి.


Also read: Naga Shourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?


Also read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook