Naga Shourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Krishna vrinda vihari: హీరో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం  'కృష్ణ వ్రింద విహారి'. తాజాగా ఈ  సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 02:51 PM IST
  • నాగశౌర్య జోడీగా కొత్త హీరోయిన్
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఏప్రిల్ 22వ తేదీన విడుదల
Naga Shourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Nagashourya Krishna vrinda vihari release date: యువ నటుడు నాగశౌర్య (Naga Shourya) నటించిన 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Movie) రిలీజ్​ డేట్​ ఫిక్స్ అయింది. ఈ చిత్రం ఏప్రిల్​ 22న థియేటర్లలో సందడి చేయనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్​ ఆర్​.కృష్ణ దర్శకత్వం వహించారు. కథానాయికగా షిర్లే సెటియా నటించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ..పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగశౌర్య, షిర్లే సెటియా (Sherley Setia) స్కూటర్‌పై వెళ్తున్నారు. ఇందులో శౌర్య లుక్ సరికొత్తగా కనిపిస్తోంది. 

నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఉమా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ వంటి కమెడియన్స్ ఉన్నారు.  సీనియర్ నటి రాధిక కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఒక పాట మినహా దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' చిత్రం పర్వాలేదనిపించినా.. 'లక్ష్య' మూవీ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. మరి ఈ చిత్రంతోనేనైనా నాగశౌర్య హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.

Also Read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News