Subbaraju: రహస్యంగా పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే..?
Subbaraju marriage: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. అయితే కొంతమంది సీనియర్ నటీనటులు మాత్రం వైవాహిక బంధానికి దూరంగానే ఉన్నారు. ఏదైనా అడిగితే మాత్రం సున్నితంగా తప్పించుకుంటున్నారు. మరి తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
Subbaraju marriage photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణవంశీ దర్శకత్వంలో 2003లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సుబ్బరాజు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలలో కనిపించి నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్ళిన సుబ్బరాజు ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.
అదే ఏడాది "అమ్మానాన్న ఓ తమిళమ్మాయి" సినిమాలో కూడా నటించడంతో మంచి గుర్తింపు లభించింది. ఇక పూరి జగన్నాథ్ సినిమాతో సుబ్బరాజు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ సమయంలోనే మంచి పాత్రలలో నటించే అవకాశం దక్కించుకొని స్టార్ స్టేటస్ ను పొందారు.
విలన్ గానే కాకుండా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు సుబ్బరాజు. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక పాన్ ఇండియా నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు సుబ్బరాజు.
అన్ని భాషలలో కలిపి సుమారుగా 100కు పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు 47 ఏళ్ల వయసులో ఒక ఇంటి వారు అయ్యారు. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆసక్తి లేదని చెబుతూ వచ్చిన ఈయన ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు.
వివాహ బంధంలో అడుగుపెడుతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోని పంచుకున్నారు. ఇక సుబ్బరాజు పెళ్లి గురించి ఎలాంటి హడావిడి పుకార్లకు తావు ఇవ్వకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే వధువుకు సంబంధించిన విషయాలను నెటిజెన్స్ సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తున్నారు. ఇక వధువు ఎవరు అన్న విషయంపై క్లారిటీ రాలేదు. మరోవైపు సుబ్బరాజు దంపతులకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read more: Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.