Producer Councell announcement on Shootings​: తెలుగులో సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని తెలుగు సినీ నిర్మాతల కొంత మంది ఏకంగా సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం మీద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జూలై 26వ తేదీన సమస్యలపై చర్చలు జరిపేందుకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సినీ రంగానికి చెందిన నాలుగు విభాగాలతో సమావేశం కాబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియోల వారితో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో 26వ తేదీన సమావేశం కాబోతోంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా ద్వారా తెలియజేసే వరకు నిర్మాతలు ఎలాంటి పుకార్లు నమ్మవద్దని తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఒక ప్రకటన విడుదల చేశారు.


తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సహా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతలకు మీడియా ద్వారా అలాగే పర్సనల్ గా కూడా తెలియజేస్తారని అప్పటివరకు నిర్మాతలు ఎలాంటి నిర్ణయానికి రావద్దని వారి వెల్లడించారు.. ఫిలిం ఛాంబర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకూ సినిమా షూటింగ్లు కానీ సినిమా కార్యకలాపాలు గాని ఆపకూడదని యథావిధిగా కొనసాగించాలని ప్రకటనలో కోరారు.


అయితే ఒకపక్క సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది అని నిర్మాతలు వాపోతుంటే తమకు సరైన వేతనాలు రావడం లేదంటూ గతంలో సినీ కార్మికులు సినిమా షూటింగులకు కూడా రెండు రోజులు పాటు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: Arjun Sarja: ఆ విషాదాలు మరువక ముందే అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం!


Also Read: Pushpa 2: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు.. ఇప్పుడేం చేస్తారో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook