Youtuber Chandu Sai Arrest: సోషల్ మెసేజ్ వీడియోస్, కామెడీ వీడియోస్, షార్ట్ ఫిలింస్ తో పాపులర్ అయిన యూట్యూబర్ చందు సాయి అరెస్ట్ అయ్యాడు.  ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి.. రేప్ చేసి మోసం చేశాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లోని నార్సింగికి బాధిత యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చందుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పక్కంటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించి.. అందులో ఫన్నీ, సందేశాత్మక వీడియోలు పోస్ట్ చేసి తెలుగు ఆడియెన్స్ ను దగ్గరయ్యాడు చందు. అతని ఛానెల్ కు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే అర్థం చేసుకోండి మనోడి రేంజ్. ఇతడు నెలకు రూ.2 కోట్లు వరకు సంపాదిస్తాడని టాక్. అలాంటి వ్యక్తి తనను లవ్ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గతంలో తన పుట్టిన రోజు అని చెప్పి ఇంటికి పిలిచి 2021 ఏప్రిల్ 25 వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 


చందు సాయి అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. ఈ కేసులో చందుతోపాటు అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపైనా బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో వారిందరిపైనా పోలీసులు కేసు రిజస్టర్ చేశారు. నిందితుడు చందు సాయిపై మాత్రం రేప్, చీటింగ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 


Also Read: Naa Saami Ranga: అంజిగాడి గ్లింప్స్ వచ్చేసింది.. మాటొచ్చేత్తది అంటూ నవ్వులు పూయిస్తున్న అల్లరోడు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook