Thalapathy 66 Movie: ఇప్పుడు విజయ్ తో ఏం కావాలంటే అది చేయోచ్చు: రష్మిక
Thalapathy 66 Movie: కోలీవుడ్ హీరో విజయ్ నటించనున్న 66వ చిత్రం గురువారం (ఏప్రిల్ 7) లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తన అభిమాన హీరో పక్కన నటించే ఛాన్స్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Thalapathy 66 Movie: స్టార్ హీరోయిన్ రష్మిక మానసిక పరిస్థితి ఇప్పుడు సరిగ్గా లేదు. ఆమె అభిమాన హీరో దళపతి విజయ్ సరసన నటించే అవకాశం రావడంతో ఈ లోకంలోనే లేకుండా ఎక్కడికో వెళ్లినట్లు ఫీలింగ్ కలుగుతోందట. విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికైంది. తెలుగులో విజయ్ నేరుగా నటిస్తున్న తొలి చిత్రమిది.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్స్‌పై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం చెన్నైలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ సందర్భంగా తీసిన ఫోటోలతో ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రష్మిక.
"అరే.. ఇప్పుడు అదో మాదిరి అనిపిస్తోంది. సార్‌ను ఏళ్ల తరబడి చూస్తున్నా. ఇప్పుడు... అతనితో నాకు ఏం కావాలనిపిస్తే అది చేయొచ్చు. అతనితో నటించొచ్చు. నర్తించొచ్చు. అతని చూపులు నావైపు తిప్పుకోవచ్చు. అతనితో మాట్లాడొచ్చు. ఏం కావాలంటే అది చేయొచ్చు. మొత్తానికి ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది.!" అని సోషల్ మీడియాలో వారిద్దరూ ఫొటోలను పోస్ట్ చేసింది.
రష్మికకు విజయ్ దళపతి అంటే చాలా ఇష్టం. గతంలో పలు ఇంటర్వ్యూల్లోనూ ఆమె ఇదే విషయాన్ని చెప్పింది. విజయ్ అంటే క్రష్.. అతనితో ఒక్క సినిమా చేసినా చాలంటూ రష్మిక చాలాసార్లు బహిరంగంగానే చెప్పింది. ఇప్పుడు ఆమె అభిమానించే హీరో పక్కన నటించే అవకాశం రావడం వల్ల రష్మిక ఆనందానికి హద్దులు లేవు.
Also Read: Ante Sundaraniki movie: పంచెకట్టుతో పార్టీకి నాని, అంటే.. సుందరానికి చిత్ర యూనిట్
Also Read: Ghani Movie Review: గని మూవీ ఎలా ఉంది? వరుణ్ తేజ్ హిట్టు కొట్టాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook