Ante Sundaraniki movie: పంచెకట్టుతో పార్టీకి నాని, అంటే.. సుందరానికి చిత్ర యూనిట్

Ante Sundaraniki movie latest updates: నేచురల్ స్టార్ నాని నటించిన అప్‌కమింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 11:55 PM IST
Ante Sundaraniki movie: పంచెకట్టుతో పార్టీకి నాని, అంటే.. సుందరానికి చిత్ర యూనిట్

Ante Sundaraniki movie latest updates: నేచురల్ స్టార్ నాని నటించిన అప్‌కమింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే.. సుందరానికి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మాతలుగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్ర వినూత్న ప్రచారం సినీ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తినిపెంచుతోంది.

వివేక్ సాగర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘పంచెకట్టు’ పాటని విడుదల చేయడంతో చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషనన్స్‌ని ప్రారంభించింది. ఈ పంచెకట్టు పాట సంగీత ప్రియులని అలరిస్తోంది. ట్రెండీ ట్యూన్‌తో సరికొత్తగా, సరదాగా సాగిపోయే సాహిత్యంతో స్వరపరిచిన ఈ పాట విన్న వెంటనే హుషారు తెప్పిస్తోంది.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, లెజెండరీ క్లాసికల్ సింగర్ అరుణా సాయిరామ్ ఈ పాటను అద్భుతంగా పాడగా, హసిత్ గోలీ లిరిక్స్ అందించారు. ఇప్పుడు ‘పంచెకట్టు’పాట చార్ట్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని జరుపుకుంటుంది చిత్ర యూనిట్. ఈ వేడుకని కూడా పంచెకట్టు థీమ్‌లోనే డిజైన్ చేయడం విశేషం. ఈ పార్టీకి చిత్ర యూనిట్ అంతా పంచెకట్టులో హాజరవుతారు. సినిమా కోసం టీమ్ చేస్తున్న వినూత్న ప్రచారం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.

అంటే.. సుందరానికి సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న‘అంటే సుందరానికి’ సినిమా (Ante Sundaraniki movie) జూన్ 10న విడుదలకు సిద్ధమవుతోంది.

Also read : RRR Movie Total Collections: అక్కడ 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఆర్ఆర్ఆర్ మూవీ
Also read : Ramarao On Duty Movie: రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి 'బుల్ బుల్ తరంగ్' వచ్చేస్తోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News