Vijay-Rajinikanth:లోకేష్ కనగరాజు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈ మధ్య విడుదలయి కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకి మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం తడపడకుండా దూసుకుపోయింది. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి మాత్రం ఈ చిత్రం పైన ఏదో ఒక కాంట్రవర్సీ లేదా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది‌. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ చిత్రం మేకర్స్ ఏర్పాటు చేసిన లియో సక్సెస్ మీట్ లో వీటన్నిటి పైన స్పందించారు హీరో విజయ్. కాగా ఈ స్పీచ్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇన్ డైరెక్ట్ గా రజినీకాంత్ ని టార్గెట్ చేసి మాట్లాడినవని సోషల్ మీడియాలో రజనీకాంత్ అభిమానులు అలానే విజయ్ అభిమానులు తెగ కొత్తేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే.. ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ గొప్ప అని ఆయన అభిమానులు అలానే విజయ్ గొప్ప అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ పడుతూనే ఉన్నారు. లేటెస్ట్ గా జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో కాగా రజినీకాంత్ తన అనుభవం గురించి మాట్లాడుతూ… “ఒక కాకీ గద్ద కథ” చెప్తే అది విజయ్ గురించే అంటూ పెద్ద రచ్చ చేసారు. కాకి గాల్లోకి ఎగరగానే ఈ ప్రపంచం మొత్తం తనదే అని అనుకుంటుంది. కానీ ఆ ఆకాశం లో నేను గ్రద్ద లాంటోడిని, నన్ను కాకులు ఏమి చెయ్యలేవు అంటూ రజినీకాంత్ చెప్పడంతో అది విజయ్ గురించే అని అప్పట్లో అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు .


ఇక ఇప్పుడు లియో సక్సెస్ మీటిలో విజయ్ కూడా రజినీకాంత్ తరహాలోనే ఒక కథ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ఒక అడవిలో చాలా క్రూరమైన జంతువులూ ఉన్నాయి. అదే అడివిలో ఒక కాకి.. ఒక గ్రద్ద కూడా ఉన్నాయి అని విజయ్ అనగానే వెంటనే ఇది తప్పకుండా రజినీకాంత్ కి విజయ్ ఇచ్చే కౌంటర్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయి ఆడిటోరియం మొత్తం విజిల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఒక చిన్న కథను చెబుతూ దానికి సందేశంగా చిన్న ప్రాణిని చంపడం తేలిక.. అదేమీ పెద్ద విజయం కాదు.. అందుకే పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి.. ఆ దిశగా అడుగులు వేయండి.. అంటూ విజయ్ అనడంతో.. రజినీకాంత్ కన్నా మా విజయ్ స్పీచ్ సూపర్ గా ఉంది అంటూ విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఏకంగా ఇది రజినీకాంత్ కి కౌంటర్ అంటూ కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.


కాగా ఇదే లియో స్పీచ్ లో “ఒకరే కెప్టెన్, ఒకరే లోకనాయకుడు, ఒకరే సూపర్ స్టార్ .. అది రజినీకాంత్, ఒకరే తల” అంటూ విజయ్ రజినీకాంత్ పేరు కూడా ఎత్తడం విశేషం . మాములుగా తన సినిమా ఫంక్షన్స్ లో ఇతర హీరోల గురించి చాలా తక్కువగా ప్రస్తావించే విజయ్… లియో సక్సస్ మీట్ లో మాత్రం అదే పనిగా ప్రతి స్టార్ హీరోని కవర్ చేసాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో మనకి గొడవలు వద్దు అంటూ సలహాలు కూడా ఇచ్చాడు ఈ హీరో.


Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  


Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook