Leo Movie Leaked: ‘లియో’ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఫుల్‌మూవీ ఆన్‌లైన్‌లో లీక్
Leo Movie HD Print Leaked Online: లియో మూవీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. విడుదలైన కాసేపటికే ఫుల్ హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు లియో మూవీ టీమ్ రెడీ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా..
Leo Movie HD Print Leaked Online: దళపతి విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన లియో మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే కొందరు తమిళ అభిమానులు నెట్టింట తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ అర్థం కాలేదని.. లోకేశ్ మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తాడని అంటున్నారు. సినిమా టాక్ విషయం పక్కన పెడితే.. మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం కలకలం రేపుతోంది.
లియో సినిమాను వెబ్‌సైట్లలో అక్రమంగా విడుదల చేయడానికి నిషేధం విధిస్తూ.. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన కొందరు హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసినట్లు తెలుస్తోంది. సెవన్ స్క్రీన్ స్టూడియో నిర్మాణ సంస్థ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అక్రమంగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు చేయడాన్ని నిషేధించింది. అయితే కొన్ని వెబ్‌సైట్లలో లియో మూవీ ఫుల్ మూవీ లీక్ అవ్వడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైరసీ సైట్స్ నుంచి లియో సినిమాను తొలగించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో లియో మూవీ ఓ రేంజ్‌లో ఎక్స్‌పెటేషన్స్ ఉన్నాయి. సినిమాలో యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయని.. అయితే స్టోరీ రొటిన్‌గా ఉందని అంటున్నారు. విజయ్-లోకేష్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో.. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అందరూ అంచనా వేశారు. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. మొదటి రోజు రూ.140 కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటించగా.. సంజయ్‌దత్, అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ లియో సినిమా తెలుగు హక్కులను దక్కించుకుని.. విడుదల చేసింది.
(గమనిక: https://zeenews.india.com/telugu/ ఏ రకమైన పైరసీని ప్రోత్సహించదు. పైరసీకి సపోర్ట్ చేయదు. పైరసీ అనేది 1957 కాపీరైట్ చట్టం ప్రకారం క్రిమినల్ నేరం. మీరు ఏ రూపంలోనైనా పైరసీలో పాల్గొనడం లేదా ప్రోత్సహించడం మానుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం.)
ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook