Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు

Cyclone Alert: వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2023, 10:08 AM IST
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు

Cyclone Alert: అక్టోబర్ నెలంతా వర్షాభావ పరిస్థితులు, ఎండ, ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎండల వేడి నుంచి ఏపీకు ఊరట కలగనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఈ నెల 20 అంటే రేపటికి అల్పపీడనంగా బలపడనుంది. ఆ తరువాత తుపానుగా పరివర్తనం చెందే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయిని ఐఎండీ వెల్లడించింది. 

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడ్రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఈ నెల 23 నుంచి అల్పపీడన ప్రబావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడవచ్చు. అల్పపీడనంతో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే జరిగితే రాష్ట్రంలో మరోసారి వర్షాలు దంచి కొట్టవచ్చు. ఇవాళ ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారనుంది. ఆ తరువాత వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా మారితే ఈనెల 25 నాటికి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశాలకు తుపాన్ గండం పొంచి ఉంటుంది. 

Also read: Tammineni Comments on Chandrababu: చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు: స్పీకర్ తమ్మినేని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News