Leo Telugu Poster Out: కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) నయా మూవీ లియో (Leo). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో మూపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా లియో తెలుగు పోస్టర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. ఇందులో విజయ్ కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్న లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ''నిశ్శబ్ధాన్ని పాటిస్తూ.. యుద్ధానికి దూరంగా ఉండండి'' అనే క్యాప్షన్ జోడించింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనుంది లోకేశ్‌ కనగరాజ్ టీం. ఇందులో భాగంగానే లియో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30 లేదా అక్టోబరు 01 నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లియోలో యాక్షన్‌ కింగ్ అర్జున్ హెరాల్డ్‌ దాస్‌గా, సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌గా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో  ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు  అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 



Also Read: Youtuber Harsha Sai: ఆసక్తికరంగా యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్, టీజర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook