Youtuber Harsha Sai: ఆసక్తికరంగా యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్, టీజర్..

Youtuber Harsha Sai: పాపులర్ యూట్యూబర్‌ హర్షసాయి నటిస్తున్న మూవీ టైటిల్, టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 05:16 PM IST
Youtuber Harsha Sai: ఆసక్తికరంగా యూట్యూబర్ హర్షసాయి మూవీ టైటిల్, టీజర్..

MEGA - Lo Don teaser: యూట్యూబర్‌గా హర్హసాయి చాలా ఫేమస్. ఇతడు తన వీడియోల ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. హర్షసాయి యూట్యూబ్ ఛానెల్‍కు 9 మిలియన్లకు పైగా సబ్‍స్క్రైబర్లు ఉన్నారు. ఈ పాపులర్ యూట్యూబర్ హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి మెగా అని పేరు పెట్టారు. అంతేకాకుండా దీనికి క్యాప్షన్ గా ‘లో డాన్ ’అని ఉంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుననట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా మాత్రమే కాకుండా కథ, దర్శకత్వం కూడా చేస్తున్నాడు హర్షసాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ పిక్చర్స్ పతాకంపై బిగ్‍బాస్ ఫేమ్ మిత్ర నిర్మిస్తోంది. ఈ సినిమాకు వికాస్ బాడిస మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు టీజర్ లో పేర్కొన్నారు. 

టీజర్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇందులో హర్షసాయి వీపుపై ఉన్న టాటూను హైలైట్ చేశారు. అంతేకాకుండా కోతి లాంటి ముఖం ఉన్న మనిషి, ఓ సమూహం ఇలా టీజర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ''జీవితంలో ఓటమిని ఒప్పుకున్న క్షణమే.. నిజమైన ఓటమి.. నన్ను చూస్తే ఒప్పుకునే వాడిలా కనిపిస్తున్నానా” అంటూ హర్షసాయి డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత హర్షకు ఓ ఆత్మ కనిపిస్తుంది.  'మెగా - లో డాన్' అనేది అత్యంత భారీ జంతువు అని టీజర్లో చూపించారు. “ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్ని కుదిపేసి రాజైన మనిషి కథ” అంటూ టీజర్ ను ముగించారు మేకర్స్. మెుత్తంగా హర్షసాయి మూవీ టీజర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News