Vijay: చిరంజీవి రూట్ ని ఫాలోకాబోతున్న విజయ్.. అందుకే ఇదంతా!
Thalapathy Vijay: ఇలయ దళపతి.. ఈ పేరు స్క్రీన్ పైన పడితే చాలు ఫ్లాప్ సినిమా కూడా తమిళనాడు లో మంచి బిజినెస్ సాధిస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ పీక్ దశలో దూసుకుపోతున్న ఈ హీరో సడన్ గా ..సినిమాలు ఆపేసి రాజకీయాల వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను కొన్ని విషయాల్లో మెగాస్టార్ చిరుని ఫాలో అవుతున్నాడు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Vijay in Politics: కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోలలో ఇళయ దళపతి విజయ్ ఒకరు. అటు కోలీవుడ్ లోనే కాక ఇటు టాలీవుడ్ లో కూడా అతని సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ రెమ్యూనరేషన్ కూడా అంతే భారీ రేంజ్ లో పుచ్చుకుంటున్నారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోయే విజయ్ ఆ తర్వాత సినిమాలలో నటించబోడు అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అతని చేతిలో ఉన్న కోర్ట్ సినిమా తర్వాత ఇంకా ఒక్క సినిమా తీసి.. పొలిటికల్ కెరియర్ పై దృష్టి పెట్టబోతున్నాడట.
తాను తీయబోయే ఆ లాస్ట్ మూవీ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే విధంగా మంచి సందేశాత్మకంగా ఉండబోతోంది అని టాక్. గోట్ తర్వాత విజయ్ నటించబోయే సినిమాకు డైరెక్టర్ గా కార్తీక్ సుబ్బరాజు వ్యవహరించాల్సి ఉంది.. అయితే అతనికి బదులుగా వినోద్ ఈ సినిమాకి డైరెక్టర్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు అని సమాచారం. ఈ మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి.
విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను అని అన్నప్పటి నుంచి అతని సినిమాలను మెగాస్టార్ చిత్రాలతో కంపేర్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్న టైం నుంచి వరుసగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ తీస్తూ వచ్చారు. విజయ్ కూడా ఈ విషయంలో చిరు బాటను ఫాలో అవుతున్నాడు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాలలో తన వంతు పాత్ర పోషించిన తర్వాత ఇప్పుడు తిరిగి సినీ రంగంలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
విజయ్ కూడా రాజకీయాలలో నిలదొక్కుకునేంతవరకు సినిమాలు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 49 సంవత్సరాల వయసులో రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడుతున్న ఈ హీరో.. తమిళ రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు తెస్తాడో చూడాలి. నెక్స్ట్ మూవీ తర్వాత సినిమాలు తీయడు అన్న వాదన వినిపిస్తున్న ఈ సమయంలో లియో 2 మూవీ కష్టమే కదా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారుతోంది.
Also read: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
Also read: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook