Pawan Kalyan -Vijay: సినిమా హీరోలు పాలిటిక్స్ లోకి రావడం కొత్తేమీ కాదు.  సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ పెట్టి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ పార్టీ విజయంతో.. ఎంతోమంది తెలుగు సినీ హీరోలు రాజకీయాల వైపు మొగ్గు చూపివ్వడం మొదలుపెట్టారు. కానీ ఎన్టీఆర్ తరువాత ఏ తెలుగు హీరో కూడా ఆయన స్థాయికి మాత్రం చేరుకోలేకపోయారు. చిరంజీవి ఎన్టీఆర్ లాగానే ఒక పార్టీ పెట్టి.. గెలవాలని చూసిన.. ఆ ఆలోచన కాస్త తలకిందులై ఘోర పరాజయం చవిచూశారు. అయినా కానీ భయపడకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అని మరో పార్టీ పెట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు కేవలం ఒక్క సీట్ మాత్రమే గెలుచుకున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తను నిలబడిన రెండు కాస్టిట్యూఎన్సీస్ లో ఓడిపోయారు ఈ హీరో. కాగా ఈసారి ఎలక్షన్స్ లో మాత్రం ఆ తప్పు చేయకుండా టీడీపీతో కలిసి పోటీ చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ 21 సీట్ల నుంచి కూటమిలో భాగంగా పోటీ చేయక 21 సీట్లు గెలుచుకున్నారు. దీంతో పవన్ అభిమానులు అలానే సిరి సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఈ నేపథ్యంలో ఈ మధ్యనే తమిళ ఇండస్ట్రీలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హీరో విజయ్ కూడా చంద్రబాబు నాయుడు కి అలానే పవన్ కళ్యాణ్ కి విషెస్ తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం’ అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి విజయ్ పోస్ట్ చేసారు. 


 




అలాగే చంద్రబాబు నాయుడు గురించి కూడా పోస్ట్ వేశారు ఈ హీరో. ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుని అభినందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ లీడర్ షిప్ లో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


 



 


అయితే పవన్ కళ్యాణ్ కి విజయ్ కి ఎన్నో పోలికలు ఉన్నాయి అంటూ ఈ పోస్ట్ కింద కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ పెట్ట సాగారు. ఇద్దరు కూడా తమ తమ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని.. కానీ సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఇద్దరు కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారని.. ఇందులో భాగంగా ఇద్దరు కూడా రాజకీయ పార్టీలు పెట్టారు అని.. కామెంట్స్ చేస్తున్నాడు. కాగా గతంలో తన స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. ఇక ఈ హీరో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థుల్ని పోటీ చేయించనున్నారు. మరి అక్కడ విజయ్ కూడా ఇప్పుడు పవన్ సాధించినట్టు మంచి మెజారిటీ సాధిస్తారేమో వేచి చూడాలి.


Read more: Instant Karma: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. చైన్ స్నాచర్స్ కు రోడ్డుమీద దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్..


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter