Karnal chain snatching viral video: కొందరు చోరీ చేయడంను కూడా ఒక ఆర్ట్ గా చెబుతుంటారు. మనకు ఉన్న 64 కళల్లో చోర కళ కూడా ఒకటుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇదిలా ఉండగా.. కొందరు చోరీలకు వెళ్తున్నప్పుడు అనేక రకాల ప్లాన్ లు వేసుకుంటుంటారు. మరికొందరు రెక్కీ వేసి పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం చోరీలకు ప్రయత్నిస్తుంటారు. కొందరు బ్యాంకులు చోరీ చేస్తుంటే, మరికొందరు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటుంటారు. ఇక రోడ్డుపైన వెళ్తున్న మహిళలను టార్గెట్ గా మరికొందరు చేసుకుంటారు. అడ్రస్ అడుగుతున్నట్లు, ఏదో ఆరా తీస్తున్నట్లు నటించి, సెకన్ల కాలంలో మెడలోని చైన్ లను చోరీ చేసి పారిపోతుంటారు.
చైన్ దొంగలకు తగిన శాస్తి జరిగింది
హర్యానా - కర్నాల్‌లో చైన్ స్నాచింగ్ చేసిన వారి బైక్‌ను, బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్. pic.twitter.com/URxQcBGlFs
— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024
బైక్ ల మీద వెళ్తున్నప్పుడు, ఆటోల్లో వెళ్తున్నప్పుడు చోరీలకు పాల్పడుతుంటారు. నిద్రలో ఉన్న ఆడవారి మెడలో నుంచి బంగారం కాజేస్తుంటారు. షాపింగ్ కోసం వచ్చి, లోదుస్తుల్లో లేదా చీరల కింద బంగారం దాచిపెట్టుకుని పారిపోయిన కేటుగాళ్లకు చెందిన అనేక వీడియోలు తరచుగా చూస్తునే ఉంటాం. అయితే.. కొందరు చోరీలు చేసి, ఎవరికి దొరక్కుండా ఇట్టే పారిపోతుంటారు.. మరికొందరు మాత్రం.. చోరీలు చేసి అడ్డంగా దొరికిపోతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
హర్యాలోని కర్నాల్ లో ఇటీవల ఒక దొంగతనం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇద్దరు దోంగలు ఒక మహిళను వెంబడించారు. ఆమె రోడ్డుమీద ఉన్న షాప్ లో ఏదో వస్తువులు కొనుగోలు చేస్తుంటుంది. ఒక దొంగ ఆమె వెనకాల వెళ్లి అదను కోసం చూస్తున్నాడు. మరో దొంగ బైక్ మీద పారిపోవడానికి రెడీ గా ఉన్నాడు. మొదటి దొంగ మహిళ మెడలో నుంచి చైన్ లో లాగేసి సెకన్ల వ్యవధిలో, బైక్ మీద వచ్చి కూర్చున్నాడు. మరో వ్యక్తి బైక్ ను స్పీడ్ గా స్టార్ట్ చేశాడు. ఇంకా ఇద్దరు తమ పంట పడింది.. గోల్డ్ ను అమ్మి మస్త్ జల్సా చేసుకుందామని భావించారు. కానీ ఇక్కడే వాళ్లకు ఊహించని ఘటన ఎదురైంది.
Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
ఎదురుగా ఒక బస్సు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. వెంటనే ఇద్దరు కూడా కింద పడిపోయారు. అంతేకాకుండా.. బైక్ ను వదిలేసి అక్కడి నుంచి ఇద్దరు పారిపోయాడు. దొంగలను పట్టుకొవడానికి, అక్కడి వారు ప్రయత్నించారు. కానీ వాళ్లు మాత్రం దొరకలేదు. అయిన వారు ఉపయోగించిన బైక్ నంబర్ ఆధారంగా, ఎంక్వైరీచేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీన్ని చూసిన నెటిజన్లు కర్మఫలం ఎవర్ని వదలదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తప్పు చేయగానే వెంటనే పనిష్మెంట్ పడాల్సిందే.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter