Leo Trailer Released: విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ లియో. ఇండియా మోస్ట్ అవేటెడ్ చిత్రాల్లో ఇది ఒకటి. గురువారం (అక్టోబర్ 5) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ను తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. విజయ్ యాక్షన్, లోకేష్ టేకింగ్ తో ట్రైలర్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో విజయ్ దుమ్మురేపాడు. యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ విలన్స్ గా ఆకట్టుకున్నారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ మూవీ అక్టోబరు 19న ఆడియెన్స్ ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ కు జోడిగా త్రిష నటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్ కీలకపాత్రల్లో నటించారు. లియో మూవీని లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు. ఐమ్యాక్స్ వెర్షన్‍లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. విక్రమ్ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై  విపరీతమైన హైప్ నెలకొని ఉంది. లియో సినిమాకు ఓవర్సీస్‍లో ఊహించని స్పందన వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఓవర్సీస్ లో 40 వేల టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. 


ఇప్పటికే ఈ మూవీ సెన్షార్ ను పూర్తి చేసుకుంది.  ఈ మూవీకి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ కూడా లభించింది. రెండు గంటల నలభై నిమిషాల రన్‌టైమ్‌ ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా  తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు వెచ్చించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. 



Also Read: Leo Movie: ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే అక్కడ సంచనాలు సృష్టిస్తున్న విజయ్ 'లియో'..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook