తెలుగు నటులలో బాలీవుడ్‌లో నటించి తమ లక్ పరీక్షించుకున్న వారిని చూశాం. అయితే ఆంగ్ల చిత్రాల్లో కూడా నటించిన కొందరు నటీనటులు ఉన్నారు. వారి గురించి ఈ వ్యాసంలో మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్ స్టార్  కృష్ణ - సూపర్ స్టార్ కృష్ణ నటించిన "మోసగాళ్ళకు మోసగాడు" చిత్రం గుర్తుందా. 1971లో విడుదలైన ఈ చిత్రం గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, మెకన్నాస్ గోల్డ్ లాంటి హాలీవుడ్ కౌబాయ్ చిత్రాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకొని తెలుగులో రూపొందించారు.  ఈ చిత్రాన్ని మళ్లీ "ట్రెజర్ హంట్" పేరుతో ఆంగ్లంలో అమెరికాలో విడుదల చేశారట ఈ చిత్ర నిర్మాతలు. 


చిరంజీవి - చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం "కొదమ సింహం". 1990లో విడుదలైన ఈ చిత్రాన్ని హాలీవుడ్‌‌లో కూడా విడుదల చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ఆంగ్లంలో ఈ చిత్రం "హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్" పేరుతో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన చాలా రోజుల తర్వాత చిరంజీవి "అబూ - ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్" పేరుతో ఓ ఆంగ్ల చిత్రానికి కూడా సైన్ చేశారు. హాలీవుడ్ దర్శకుడు డౌచన్ గెర్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది.


సుమన్ - దక్షిణాది నటుడు సుమన్ నటించిన "డెత్ అండ్ టాక్సీస్" ఆంగ్ల చిత్రం కెవిన్ ముఖర్జీ దర్శకత్వంలో 2007లో విడుదలైంది. ఈ చిత్రంలో ఓ టాక్సీ ప్రయాణికుడి పాత్రలో సుమన్  కనిపిస్తారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ పాత్ర ఆ సినిమాలో ఉండడం గమనార్హం.


శరత్ బాబు - తెలుగు నటుడు శరత్ బాబు నటించిన 'వేకింగ్ డ్రీమ్స్' అనే ఆంగ్ల చిత్రం 2007లో అమెరికాలో విడుదలైంది. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో ఆయన దర్శనమిస్తారు.


రాజేంద్ర ప్రసాద్ - రాజేంద్ర ప్రసాద్ 2009లో నటించిన 'క్విక్ గన్ మురుగన్' చిత్రం భారతీయ భాషలతో పాటు ఆంగ్లభాషలో కూడా తెరకెక్కింది. అలాగే విదేశాల్లో కూడా ప్రదర్శితమైంది. శశాంక్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


లక్ష్మీ మంచు - తెలుగు నటి లక్ష్మీ మంచు కూడా పలు హాలీవుడ్ చిత్రాలలో నటించారు. ది ఓడ్ (2008), డెడ్ ఎయిర్ (2009) లాంటి ఆంగ్ల చిత్రాలలో ఆమె నటించారు


అనీష్ కురువిల్లా - ఆవకాయ బిర్యానీ సినిమాకి దర్శకత్వం వహించిన అనీష్ కురువిల్లా ఓ ఆంగ్ల చిత్రంలో కూడా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2000లో అమెరికాలో రిలీజైన "డాలర్ డ్రీమ్స్" చిత్రంలో ఓ పాత్ర పోషించారు.


ప్రకాష్ కోవెలమూడి - కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ఓ ఆంగ్ల చిత్రంలో నటించారు. "మార్నింగ్ రాగా" పేరుతో విడుదలైన ఆ  చిత్రం 2004లో విడుదలైంది.


అమీ జాక్సన్ - ఎవడు చిత్రంలో నటించిన అమీ జాక్సన్, బూగీమ్యాన్ అనే ఆంగ్ల చిత్రంలో నటించింది.


ప్రభాస్ - ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాన్ని పలువురు హాలీవుడ్ చిత్ర విమర్శకులు కూడా చూసి సమీక్షించడం విశేషం. 


హాలీవుడ్‌లో నటించిన ఇతర భారతీయ నటులు


రజనీ కాంత్ - రజనీకాంత్ 1988లో  'బ్లడ్ స్టోన్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి డ్వైట్ హెచ్ లిటిల్ అనే దర్శకుడు డైరెక్షన్ వహించారు.


దేవానంద్ - 1965 లో దేవానంద్ నటించిన "ది గైడ్" చిత్రం హిందీతో పాటు ఆంగ్లంలో కూడా తెరకెక్కింది


శశికపూర్ - శశికపూర్ తన కెరీర్ తొలినాళ్ళలో హిందీతో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించారు. అందులో ది హౌస్ హోల్డర్, షేక్స్‌పియర్ వాలా, ప్రెటీ పోలీ, బొంబాయి టాకీస్ చిత్రాలు ప్రముఖమైనవి


కబీర్ బేడీ - కబీర్ బేడీ 1983లో వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'ఆక్టోపసీ'లో నటించారు


గుల్షన్ గ్రోవర్ - గుల్షన్ గ్రోవర్ పలు ఆంగ్ల చిత్రాలలో నటించారు. ది సెకండ్ జంగిల్ బుక్, హానర్ కిల్లింగ్, స్వీట్ అమెరికా లాంటి చిత్రాలు అందులో ముఖ్యమైనవి


అమితాబ్ బచ్చన్ - అమితాబ్ బచ్చన్ 2013లో 'ది గ్రేట్ గాట్స్‌బీ' అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు


అమ్రిష్ పూరి - అమ్రిష్ పూరి స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఇండియానా జోన్స్ చిత్రంలో నటించారు


ఇర్ఫాన్ ఖాన్ - ఇర్ఫాన్ ఖాన్ ఇన్ఫెర్నో, లైఫ్ ఆఫ్ ది పై లాంటి చిత్రాలలో నటించారు


టబు - హిందీతో పాటు పలు తెలుగు చిత్రాలలో నటించిన టబు నేమ్ సేక్, లైఫ్ ఆఫ్ ది పై చిత్రాలలో నటించారు


మల్లికా షెరావత్ - మల్లికా షెరావత్ కూడా ఆంగ్ల చిత్రాల్లో నటించారు. ది మిత్, పాలిటిక్స్ ఆఫ్ లవ్ అందులో ముఖ్యమైన చిత్రాలు. 


అనుపమ్ ఖేర్ - అనుపమ్ ఖేర్ కూడా  పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. బెండ్ ఇట్ లైక్ బెక్‌హామ్, సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్ లాంటి చిత్రాలలో ఆయన నటించారు


నసీరుద్దీన్ షా - నసీరుద్దీన్ షా కూడా పలు ఆంగ్ల చిత్రాల్లో నటించారు. అందులో మాన్సూన్ వెడ్డింగ్, ది లీగ్ ఆఫ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ జెంటిల్ మేన్ చిత్రాలు ముఖ్యమైనవి


ఓంపూరి - ఓంపురి కూడా పలు ఆంగ్ల చిత్రాల్లో నటించారు. అందులో సిటీ ఆఫ్ జాయ్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్, గోస్ట్ అండ్ ది డార్క్‌నెస్ చిత్రాలు ప్రముఖమైనవి


అనిల్ కపూర్ - అనిల్ కపూర్ కూడా పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అందులో స్లమ్‌డాగ్ మిలియనీర్, మిషన్ ఇంపాజిబుల్ గోస్ట్ ప్రోటోకాల్ అనే చిత్రాలు అందులో ప్రముఖమైనవి


షబానా ఆజ్మీ - షబానా ఆజ్మీ సిటీ ఆఫ్ జాయ్, సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ లాంటి చిత్రాలలో నటించారు


ఐశ్వర్యారాయ్ - ఐశ్వర్యారాయ్ కూడా పలు హాలీవుడ్ చిత్రాలలో నటించారు. అందులో బ్రైడ్ అండ్ ప్రిజ్యుడైస్, ది మిస్ట్రస్ ఆఫ్ స్పైసెస్, ది పింక్ పాంథర్, ది లాస్ట్ లీజన్ చిత్రాలు ప్రముఖమైనవి


దీపికా పదుకొణే - దీపికా పదుకొణే ఇటీవలే ట్రిపుల్ ఎక్స్ - ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ అనే చిత్రంలో నటించారు


ప్రియాంక చోప్రా - క్వాంటికో వంటి హాలీవుడ్ టీవీ సిరీస్‌లో నటించిన ప్రియాంక, తర్వాత బేవాచ్ చిత్రంలో కూడా నటించారు


నర్గీస్ ఫక్రీ - బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ "స్పై" పేరుతో 2015లో విడుదలైన ఓ హాలీవుడ్ చిత్రంలో నటించారు