The Birthday Boy: ఆహాలో ది బర్త్‌డే బాయ్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. ఆ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు..?
The Birthday Boy Streaming In Aha: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో విస్కీ దాసరి దర్శకత్వంలో రూపొందించిన మూవీ ది బర్త్ డే బాయ్. ఇప్పటికే థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ మూవీ అలరిస్తోంది.
The Birthday Boy Streaming In Aha: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీస్తే సినిమాలు థియేటర్‌లో అయినా.. ఓటీటీలో అయినా జనాలు బ్రహరథం పడుతున్నారు. ప్రస్తుం కంటెంట్ బేస్డ్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. కేవలం మాస్ మసాల చిత్రాలు తీస్తే పక్కనపెట్టేస్తున్నారు. కథ మంచిగా ఉంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలోనే ఆడియన్స్ ముందుకు వచ్చిన బర్త్ డే బాయ్ మూవీ అలరించింది. ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఐదుగురు ఫ్రెండ్స్ చుట్టూ సాగే ఈ సినిమా స్టోరీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆగస్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది.
Also Read: TGSRTC: రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ..
విస్కీ దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బొమ్మా బొరుసా బ్యానర్‌పై ఐ.భరత్ నిర్మించారు. ఈ మూవీని బిగ్ ఫిష్ సంస్థ ఆహాలోకి తీసుకువచ్చింది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ అందించారు. విదేశాల్లో ఉండే ఫ్రెండ్స్ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్న సమయంలో జరిగిన ఓ అనుకోని సంఘటన వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి..? అనే పాయింట్‌తో సినిమాను రూపొందించారు.
2016లో డైరెక్టర్ విస్కీ దాసరి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న టైమ్‌లో జరిగిన ఓ సంఘటనను కథగా మార్చి.. తెరకెక్కించారు. బర్త్ డే వేడుకల్లో ఓ ఫ్రెండ్ ఎలా మరణించాడు..? ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అన్ని రకాల అంశాలను మేళవించి తెరపై ఆవిష్కరించారు. ప్రశాంత్ శ్రీనివాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. స్టోరీలోని టెన్షన్, ఎమోషన్‌ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సంకీర్త్ రాహుల్ విజువల్స్ ప్లస్ అవ్వగా.. కెమెరా పనితనం మనల్ని సినిమాలో మమైకం చేస్తుంది.
==> నటీనటులు: రవికృష్ణ, సమీర్ మల్ల, రాజీవ్ కనకాల.
సాంకేతిక బృందం
==> దర్శకుడు : విస్కీ
==> నిర్మాత: ఐ భరత్
==> DOP: సంకీర్త్ రాహుల్
==> సంగీత దర్శకుడు: ప్రశాంత్ శ్రీనివాస్
==> ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ జి
==> ఎడిటర్: నరేష్ అడుప
==> సింక్ & సౌండ్ డిజైన్: సాయి మనీంధర్ రెడ్డి
==> సౌండ్ మిక్సింగ్ అ రవింద్ మీనన్
==> కలర్ గ్రేడింగ్: మేటిన్ ఒకట
==> మేకప్ చీఫ్: వెంకట్ రెడ్డి
==> పబ్లిసిటీ డిజైనర్: ఓంకార్ కడియం
==> డిజిటల్ మార్కెటింగ్: బిగ్ ఫిష్ సినిమాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.