The Ghost Movie to Release in Hindi also: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ఘనంగా విడుదలయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలు వేదికగా ఘనంగా జరిగింది. అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఈ వేడుకకు హాజరై తమ తండ్రి సినిమాకు తమ వంతుగా ప్రమోషన్స్ కూడా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా నాగార్జున హిందీ డిజిటల్, శాటిలైట్ బయర్లకు సినిమా చూపించి మరీ అక్కడ థియేటర్లలో రిలీజ్ చేయడానికి నాగార్జున ఒప్పించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాతో నార్త్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అనీష్ శెట్టి అనే ఒక కీలకపాత్రలో నాగార్జున నటించారు.


పాత్ర చిన్నది అయినా సరే నాగార్జున బ్రహ్మాస్త్ర లాంటి బడా ప్రాజెక్టులో భాగమవడంతో ఆయనకు కూడా హిందీలో కాస్త క్రేజ్ ఏర్పడిందని అక్కడి సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ది ఘోస్ట్ సినిమా ద్వారా ఆయన హిందీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప సినిమాని ముంబైలో డిస్ట్రిబ్యూట్ చేసిన మనీష్ తో నాగార్జున చర్చలు జరిపారని, సినిమా హిందీలో విడుదలవుతున్న విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.


ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అలాగే ఆయన సరసన హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దాదాపుగా హిందీ సహా మలాయళ బాషలలో విడుదలవుతోంది. ఇలా చిరంజీవి-నాగార్జున మధ్య 20 ఏళ్ల నుంచి పోటీ లేదని, ఇప్పుడు పోటీ పడుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. 
Also Read: Neha Chowdary Hot Photos: బిగ్ బాస్ నుంచి ఎలిమినేటయిన నేహా చౌదరిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?


Also Read: Ginna Movie Postponed : పెద్దలతో ఎందుకులే.. వెనక్కు తగ్గిన మంచు విష్ణు.. జిన్నా వాయిదా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook