The Kerala Story Crosses 100 Crores: కేరళలో హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన అమ్మాయిలను మతం మార్చి ఐసిస్ ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తున్నారని, అలా దాదాపుగా 32 వేల మంది యువతులు మిస్ అయ్యారంటూ ఒక సంచలనమైన కథాంశంతో తెరకెక్కించిన స్టోరీ ది కేరళ స్టోరీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించగా సుదీప్తో సేన్ డైరెక్ట్ చేశారు. సోనియా బలాని, యోగితా బిహాని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి సంచలన వసూళ్లు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఇక తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా 9 రోజుల్లో 113 కోట్ల వరకు నెట్ వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.


Also Read: Ruhani Sharma Photos: వైట్ స్లీవ్ లెస్ టాప్లో సెగలు రేపుతున్న రుహానీ శర్మ..


ఈ సినిమా మొదటి రోజు 8 కోట్ల మూడు లక్షల వసూలు చేస్తే రెండవ రోజు 11 కోట్ల 22 లక్షలు, మూడవరోజు 16 కోట్ల 40 లక్షలు, నాలుగవ రోజు 10 కోట్ల 7 లక్షలు,  5వ రోజు 11 కోట్ల 14 లక్షలు, ఆరవ రోజు 12 కోట్లు వసూలు చేయగా ఏడవ రోజు 12.30 కోట్లు, 8వ రోజు 12 కోట్ల 35 లక్షలు, 9వ రోజు 19 కోట్ల 50 లక్షలు వెరసి 113 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది ఈ సినిమా.


ఇక ఆసక్తికరంగా ఈ సినిమాని తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నిన్న అంటే శుక్రవారం నాడు ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్లు లభించకపోవడంతో తెలుగులో వసూళ్లు ఎక్కువగా నమోదు కాలేదని చెప్పాలి. చూడాలి భవిష్యత్తులో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించి ముందుకు దూసుకు వెళుతుందో లేదో అనేది.


Also Read: Chatrapathi Remake: దారుణంగా హిందీ ఛత్రపతి కలెక్షన్స్.. బొక్కబోర్లా పడ్డారుగా!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook