The Kerala Story Telugu: తెలుగులో రిలీజైన `ది కేరళ స్టోరీ`.. ఏం చేస్తుందో?
The Kerala Story Telugu version: మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ది కేరళ స్టోరీ అనే సినిమా పెద్ద ఎత్తున విడుదలవగా ఈరోజు తెలుగు వర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు వర్షన్ ఈ సినిమా వసూళ్లను ఎంత ముందుకు తీసుకు పోతుందో చూడాలి.
The Kerala Story Telugu version releases today: మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ది కేరళ స్టోరీ అనే సినిమా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత వారం రోజుల నుంచి అనేక రకాల కారణాలతో వార్తలలో నిలుస్తూనే ఉంది. సినిమా వివాదాస్పదమైన అంశంతో తెరకెక్కడంతో ఏకంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు థియేటర్లలో సినిమాని ప్రదర్శించకూడదు అంటూ నిషేధాజ్ఞలు సైతం ప్రకటించే వరకు వెళ్ళింది.
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోపక్క ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. నిజానికి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ముందుగా హిందీ వర్షన్ రిలీజ్ చేయగా ఒక వారం రోజుల తర్వాత ఈరోజు తెలుగు వర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చేసింది. మరి తెలుగు వర్షన్ ఈ సినిమా వసూళ్లను ఎంత వరకు తీసుకు వస్తుంది అనేది చూడాలి.
Also Read: Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్
ఇక హిందీ విషయానికి వస్తే ఈ సినిమా సంచలన వసూళ్లు నమోదు చేస్తూ మొదటి వారంలో 81 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆదాశర్మ, యోగితాభిహాని సిద్ధి ఇద్నాని, సోనియా బలాని ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ముందు 32,000 మంది కేరళ మహిళల జీవితాలను ఆధారంగా తెరకెక్కించింది అని చెప్పినా సరే చివరి నిమిషంలో ఎందుకు ముగ్గురి జీవితాలను ఆధారంగా చేసుకున్న ఈ సినిమా తరికెక్కించామని ప్రకటించారు.
ఈ సినిమా కథ ప్రకారం శాలిని ఉన్నికృష్ణన్, నీమా, గీతాంజలి, ఆసిఫా హాస్టల్ లో ఒకే గదిలో ఉండి నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఒక మతానికి చెందిన అమ్మాయి మిగతా మతానికి చెందిన అమ్మాయిలను తమ మతంలోకి మారేలా ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత వారిని ఐసిస్ గ్రూపులో చేర్చేందుకు పాస్పోర్ట్ లు కూడా ఏర్పాటు చేసి దేశం దాటిస్తున్నట్లుగా చూపించారు. ఆ తరువాత వారు పడ్డ బాధలు కళ్లకు కట్టినట్టు చూపారు.
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook