The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ‘కల్కి 2898 AD’ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు ప్రభాస్ చేతిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం’ మూవీ ఉంది. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేయాల్సిన ‘స్పిరిట్’.. హను రాఘవపూడితో చేయాల్సిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ‘ఫౌజీ’ మూవీలు లైన్ లో ఉన్నాయి. అటు కన్నప్ప మూవీ కూడా ప్రభాస్ ను నమ్ముకునే మంచు విష్ణు డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాడు.  అయితే.. సడెన్ గా మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజా సాబ్’ మూవీ పై ఇపుడేమంత కొంపలు మునిగిపోయినట్టు అప్ డేట్ ఇచ్చారు. ఇస్తే గిస్తే.. ఏదైనా డిఫరెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ప్రెజెంట్ చేస్తే బాగుండేది.
 
కానీ తాజాగా విడుదల చేసిన ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ లో పెద్ద కిక్కు లేదని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అంటున్నారు.  ప్రభాస్ చేసిన ఏదో కమర్షియల్  యాడ్ లా ఉందనే  కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ మాత్రం.. ఒకప్పటి రెబల్ స్టార్ రొమాంటిక్ మూవీస్ ను గుర్తుకు తెస్తున్నాయి. అదొక్కటే తప్ప ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ పై సినిమాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.  ఏదో హడావుడిగా రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడానికి అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో విడుదల చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం  షూటింగ్ మాత్రమే పూర్తైయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫస్ట్ గ్లింప్స్ లో ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ డేట్ అనైన్స్ చేశారు. ఆ డేట్ కు ‘ది రాజా సాబ్’ విడుదలవుతుందా లేదా అనేది కూడా డౌటే. ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలేవి చెప్పిన ఏ డేట్ కు రిలీజ్ కాలేదు. బాహుబలి నుంచి ఈ సీన్ రిపీట్ అవుతూనే ఉంది.  మరి ఈ సారైనా చెప్పిన డేట్ కు ప్రభాస్ సినిమా రిలీజైతే.. అది ఒక రికార్డు అని చెప్పాలి. మొత్తంగా మారుతి అండ్ పీపుల్స్ మీడియా వాళ్లు తమ అప్ కమింగ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కోసమే ‘ది రాజా సాబ్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికే ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్ల్స్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter