Actress Vinaya Prasad: ప్రముఖ నటి ఇంట చోరీ.. దీపావళికి వెళ్లి వచ్చేలోపు ఇల్లంతా ఊడ్చేశారు!
Theft at Actress Vinaya Prasad Home: తాజాగా నటి వినయ ప్రసాద్ ఇంట చోరీ జరిగినట్టు తెలుస్తోంది, పండుగకు ఊరు వెళ్లి వచ్చేలోపు తాళాలు పగలకొట్టి చోరీ చేసినట్టు ఫిర్యాదు చేశారు.
Theft at Actress Vinaya Prasad Home: తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు మహేష్ బాబు ఇంట్లో చోరీకి యత్నించిన ఒక వ్యక్తి పట్టుబడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి ఓ దొంగ నేరుగా మహేష్ ఇంటికి వచ్చి 30 అడుగుల ఎత్తున్న గోడ ఎక్కి లోపలికి దిగుతుండగా కింద పడిపోయాడు. కిందపడగానే పెద్దగా అరవడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. చోరీకి ప్రయత్నించిన వ్యక్తి ఒడిశాకు చెందినవాడని, గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి చనిపోయే ముందు ఈ ఘటన జరిగింది. సెప్టెంబరు 28న ఇందిరాదేవి మృతి చెందగా, అంతకుముందు రోజు 27వ తేదీ మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు వెళ్లారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి వినయ ప్రసాద్ బెంగళూరులోని తన నివాసంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అక్టోబరు 22న తన భర్తతో కలిసి ఉడిపి వెళ్లి వచ్చినట్లు సమాచారం.
తిరిగి ఆమె అక్టోబర్ 26న సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. తన ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటి 26వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇంట్లోని గదిలోని లాకర్‌లో ఉంచిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని ఆమె గుర్తించారు.
దీపావళి పండుగ కోసం నటి వినయ ప్రసాద్ తన కుటుంబంతో సహా తన స్వగ్రామం ఉడిపికి వెళ్లారు. అదే సమయంలో దొంగలు నటి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి నగదును అపహరించినట్లు సమాచారం. పండుగ ముగించుకుని ఊరు నుంచి వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఆమె గుర్తించారు. ఇక దీపావళి సందర్భంగా నటి వినయ ప్రసాద్ ఇంట్లోనే కాకుండా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చోరీ ఘటనలు నమోదయ్యాయి. సాధారణంగా పండుగ సమయంలో చాలా మంది తమ సొంత ఊళ్లకు వెళుతూ ఉంటారు, అలా తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తుపట్టి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Also Read: Aditi Rao Hydari Cried : ఆ టైంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని..బయటపెట్టిన అదితి రావు హైదరీ!
Also Read: Vijay Devarakonda tension: సమంత దెబ్బకు టెన్షన్ విజయ్ దేవరకొండ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook