Tollywood actors in Struggling Phase: టాలీవుడ్ లో కొంత మంది హీరోలు హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. తప్పుడు కథలు ఎంచుకోవడం వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో వీరి సినిమా ఆడకపోయి ఉండొచ్చు. గతంలో వరుస విజయాలు సాధించిన హీరోలు ఇప్పుడు డిజాస్టర్స్ ను చూస్తున్నారు. వీరిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగచైతన్య, అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ వంటి వారు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున రెడ్డితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడి చాలా కాలామే అయింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో విజయ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడో లేదా చూడాలి. యాక్షన్ హీరో గోపీచంద్‌ హిట్‌ కొట్టి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవల ఆయన నటించిన రామబాణం కూడా అడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈసారైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈసారి గాండివధారి అర్జున అనే సినిమాతో వస్తున్నాడు. ఈమూవీతోనైనా గాడిలో పడాలని చూస్తున్నాడు. అక్కినేని యువహీరోలకు కూడా వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. రీసెంట్ గా నాగచైతన్య వచ్చిన కస్టడీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో వచ్చే సినిమాతోనైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. ఈ హీరో ఇటీవల నటించిన ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇటీవల హిందీలో చేసిన చత్రపతి రీమేక్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. టాలెంటెట్ హీరో శర్వానంద్ కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. 


Also read: Tamannaah: తమన్నాకు రూ.2 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన ఉపాసన.. ఎందుకో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook