This week OTT Theatre Movies : ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. అక్కడ రకుల్.. ఇక్కడ సన్నీ
This week OTT Theatre Movies ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేసే చిత్రాల లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్లో కాకుండా ఈ సారి ఓటీటీలోనే ఎక్కువగా చిత్రాలు రాబోతోన్నాయి. ఈ లిస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
This week OTT Theatre Movies తెలుగులో సంక్రాంతి సందడి ముగిసింది. కానీ సంక్రాంతికి వచ్చిన సినిమాల సందడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్లో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డి బాగానే ఆడేస్తున్నాయి. ఈ వారం కూడా ఆ రెండు చిత్రాలే హవా కొనసాగించేలా ఉన్నాయి. దీంతో వేరే ఇతర చిత్రాలు ఏవీ కూడా థియేటర్లోకి రావడం లేదు. చిన్న చిత్రాలు వస్తున్నాయి. కానీ వాటిపై అంతగా బజ్ ఏమీ లేదు.
అయితే ఓటీటీలో మాత్రం కుప్పలుతెప్పలుగా సినిమాలు రాబోతోన్నాయి. మరీ ముఖ్యంగా హిందీ నుంచి ఎక్కువ సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్నాయి. అజయ్ దేవగణ్ దృశ్యం 2, అమితాబ్ బచ్చన్ ఉంచాయ్ గత వారమే ఓటీటీలోకి వచ్చాయి. గత ఏడాది చివర్లో దృశ్యం 2 సినిమా ఒక్కటే బాలీవుడ్‌కు ఊపిరి పోసినట్టు అయింది. ఉంచాయ్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కానీ రికార్డ్ కలెక్షన్లు మాత్రం రాలేదు. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇప్పుడు ఈ వారం మాత్రం.. మిషన్ మజ్ను, ఛత్రివాలి అనే సినిమాలు రాబోతోన్నాయి. జనవరి 20న నెట్ ఫ్లిక్స్‌లో మిషన్ మజ్ను, ఛత్రివాలి సినిమా జీ5లో రాబోతోన్నాయి. ఆహాలో డ్రైవర్ జమున అనే మూవీ జనవరి 20న విడుదల కానుంది. హాట్ స్టార్ లో ఝాన్సీ రెండవ సీజన్ వెబ్ సిరీస్ ఈనెల 19న విడుదల కానుంది.
జి5లో ఏటీఎం అనే వెబ్ సిరీస్ మీద బజ్ క్రియేట్ అయి ఉంది. హరీష్ శంకర్ రాసిన కథ కావడం, అందులో దివి, వీజే సన్నీ వంటి బిగ్ బాస్ స్టార్లు ఉండటంతో ఏటీఎం మీద మంచి క్రేజ్ నెలకొంది. పైగా ఇది దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఛత్రివాలి అని హిందీ సినిమా జనవరి 20న రానున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా సీజన్ 2 రానుంది. అలా ఈ వారం థియేటర్లో కంటే ఓటీటీలో సందడి ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. ఇక వచ్చే వారం అయితే షారుఖ్ పఠాన్ దేశం మొత్తం హంగామా క్రియేట్ చేసేందుకు సిద్దంగా ఉంది.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook