Shilpa Shetty Exposed Akshay Kumar Cheating: సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయినా హీరోయిన్లలో శిల్పా శెట్టి కూడా ఒకరు. కర్ణాటకలోని మంగళూరు బెల్టుకు చెందిన ఆమె తొలుత దక్షిణాది సినిమాల్లో మెరిసి ఆ తర్వాత బాలీవుడ్ పరిశ్రమలో నిలదొక్కుకుంది. అయితే ఆమె ఒకప్పుడు స్టార్ హీరోతో ప్రేమలో ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అక్షయ్ కుమార్. 90లలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ ప్రేమించుకునే వారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిద్దరూ కలిసి చేసిన ఒక సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ చిగురించడం ఆ తర్వాత అది చాలా దూరం వెళ్లడం జరిగిందట. సినిమా స్క్రీన్ మీద ఎలా అయితే కెమిస్ట్రీ పండించేవారో, ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే విధంగా కెమిస్ట్రీ పండించే ఈ జంట 2000 సంవత్సరంలో విడిపోయింది. ఆ విడిపోతున్న సమయంలో శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన ఆరోపణల ప్రకారం అక్షయ్ కుమార్ ఆమెను మోసం చేశారట.


తాను అక్షయ్ కుమార్ తో చాలా ప్రేమలో ఉన్నానని కానీ అక్షయ్ కుమార్ తనను మోసం చేస్తాడని ఊహించలేదని అని చెప్పుకొచ్చింది. తనతో రిలేషన్ షిప్ లో ఉండగానే అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నాతో కూడా డేటింగ్ చేసేవాడని ఆ విషయం తెలియగానే తాను షాక్ కు గురయ్యానని శిల్పా శెట్టి అప్పట్లో ఆరోపించింది. ఈ బ్రేకప్ వార్తల మీద శిల్పా శెట్టి ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అది తన జీవితంలోనే ఒక దారుణమైన స్టేజ్ అని ఎందుకంటే తనకు నమ్మకం మీదే నమ్మకం పోయిందని కానీ కాలక్రమేణా ఇప్పుడు అలాంటి విషయాలన్నీ అధికమించి ఇక్కడ దాకా వచ్చానని చెప్పుకొచ్చింది.


తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన శిల్పా శెట్టి అక్షయ్ తనకు చేసిన ప్రామిస్ ను కొమ్ము చేసి ట్వింకిల్ కన్నాతో రిలేషన్ పెట్టుకున్నాడని పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకపక్క శిల్పా శెట్టి మరోపక్క అక్షయ్ ఇద్దరు వేరువేరు వ్యక్తులను వివాహం చేసుకుని తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. అక్షయ్ 2001 లో ట్వింకిల్ కన్నా ని వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిల్పా శెట్టి సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుంది. ఆమెకు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నారు.


Also Read: Vennira Aadai Nirmala: ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి డోర్ తీయ్యమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


Also Read: Shanmukh Jaswanth Romance : కొత్త పిల్లతో షన్ముఖ్ జస్వంత్ రొమాన్స్.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook