Vennira Aadai Nirmala: ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి డోర్ తీయ్యమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Vennira Aadai Nirmala Allegations: ఒక బడా స్టార్ హీరో తాగి డోర్ తీయమని తన గది బయటకు వచ్చి గొడవ చేశాడు అంటూ సీనియర్ స్టార్ హీరోయిన్ కామెంట్ చేసింది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 20, 2023, 07:22 PM IST
Vennira Aadai Nirmala: ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి డోర్ తీయ్యమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Actress Vennira Aadai Nirmala Allegations on Star Hero: సినీ పరిశ్రమలో మీటూ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆడవారికి సినిమాల్లో అవకాశాలు కావాలి అంటే కచ్చితంగా పడక సుఖం తీర్చాల్సిందే అంటూ హీరోలు, దర్శక నిర్మాతలు ఒకప్పుడు చాలా ఇబ్బంది పెట్టే వారని అనేక మంది తెరమీదకు వచ్చారు. శ్రీ రెడ్డి వంటి వారైతే ఈ విషయం మీద ఉద్యమం కూడా చేస్తే చాలా మంది మీటూ ఉద్యమం పేరుతో తమకు ఒకప్పుడు జరిగిన అన్యాయాలను కూడా బయటపెట్టారు.

అయితే ఒక సీనియర్ స్టార్ హీరోయిన్ ఇదే విషయం మీద సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి ఒక బడా స్టార్ హీరో తాగి డోర్ తీయమని తన గది బయటకు వచ్చి గొడవ చేశాడు అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆమె పేరు వెన్నెరాడై నిర్మల. శాంతి కుమారి అనే ఆమె తమిళనాడులో జన్మించారు, తర్వాత నటిగా మారి నిర్మల పేరుతో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. మొదటి సినిమాని ఇంటిపేరుగా మార్చుకున్న ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 400 పైగా సినిమాల్లో నటించారు.

ఎన్జీ రామచంద్రన్ స్వయంగా ఆమెను దత్తత తీసుకోవడమే కాక సోదరిగా భావించి తన రాజకీయ వారసురాలిగా ప్రకటించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు నిర్మల ఇష్టపడలేదు. వయసు పైపడుతున్న నేపథ్యంలో ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇక తాజాగా ఆమెను ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా ఈ ఇంటర్వ్యూలో తన సినిమా కెరియర్ లో జరిగిన కొన్ని చేదు సంఘటనల గురించి నిర్మల పంచుకున్నారు.

ఒకరోజు సినిమా షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసానని ఆ సినిమాలోని హీరో అర్ధరాత్రి తాగి వచ్చి మా ఇంటి తలుపు తట్టాడని డోర్ తీయమని గొడవ చేస్తే తాను తీయలేదని దీంతో కోపం వచ్చి పదే పదే తలుపు బాదుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చారు. అయినా డోర్ తీయకపోవడంతో ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మీ పక్కనే పడుకుని వెళ్ళిపోతాను అని అన్నాడని అప్పటి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

అయితే ఆయన ఎంత బతిమిలాడినా నేను డోర్ తీయకపోవడంతో వెళ్లిపోయారని ఆ ఘటన జరిగిన రోజు నుంచి ఆ సినిమా షూటింగ్ కి వెళ్లడమే మానేశానని ఆమె అన్నారు.. ఆ సంఘటన తనను చాలా ఇబ్బంది పెట్టిందని పేర్కొన్న నిర్మల ఆ హీరో ఎవరు? ఆ సినిమా ఏమిటి? అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. నిజానికి నిర్మల తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారు . భక్త ప్రహ్లాద మొదలు కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా, సీమ సింహం, అర్జున్, శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్, రగడ వంటి సినిమాల్లో నటించారు.

Also Read: Balakrishna Free Surgeries: బాలకృష్ణ బంగారు మనసు.. తారకరత్న పేరు మీద ఫ్రీ సర్జరీలు..కోటిన్నర పెట్టి సర్జరీ ఎక్విప్మెంట్!

Also Read: Patna Obscene Video: కొంపముంచిన కక్కుర్తి.. పోర్న్ చూస్తూ రైల్వేస్టేషన్లో అందరికీ చూపించేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News